పోలీస్ యాక్షన్: ఎక్కడికక్కడ ఉద్యోగుల అరెస్ట్లు..!
పీఆర్సీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన ఉపాధ్యాయులను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కడప జిల్లాలో యుటిఎఫ్ రాష్ట్రకార్యదర్శి లక్ష్మీ రాజాను అర్ధరాత్రి దాటిన తర్వాత ముందస్తుగా అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులు చేయడం సరికాదంటూ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పిలుపు ఇచ్చాయి. మెరుగైన పీఆర్సీ లక్ష్యంగా ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.