జ‌గ‌న‌న్న భ‌రోసా : కోత‌లుండ‌వ్ !

RATNA KISHORE
జ‌గ‌నన్న ఏం చెప్పినా కొత్త‌గా ఉంటుంది. దానికి వంక‌లు పెట్ట‌డం త‌ప్పు. సీఎం హోదాలో అబ‌ద్ధాలు చెబితే న‌వ్వొస్తుంది. అప్పుడు త‌ప్ప‌క ఏద‌యినా విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల‌ని కూడా అనిపిస్తుంది. బొగ్గు ఆధారిత ప్లాంట్లు ఇవాళ మూత ప‌డిపోయేందుకు కార‌ణం ఎవ్వ‌రు? ఎప్ప‌టి నుంచి నిల్వ‌లు అడుగంటి ఉన్నాయి? వీటిపై అస్స‌లు అధికారులు అప్ర‌మ‌త్తంగా లేకుండానే డ్రామాలు న‌డుపుతున్నారా? ఇప్పుడు కాళ్ల కిందకు నీళ్లొస్తే స్పందిస్తున్నారా?

విద్యుత్ కోత‌ల‌పై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు స‌మీక్షించిన జ‌గ‌న్ మ‌రోసారి మాట్లాడారు. కోత‌ల‌కు అవ‌కాశ‌మే లేకుండా థ‌ర్మ‌ల్ విద్యుత్ ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. అదేవిధంగా కృష్ణ‌ప‌ట్నం, వీటీపీఎస్ ల‌లో థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని అన్నారు.ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ థ‌ర్మ‌ల్ విద్యుత్ సంబంధించి బొగ్గు ఎక్క‌డి నుంచైనా కొనుగోలు చేయాల‌ని చెప్ప‌డ‌మే హాస్యాస్ప‌దంగా ఉంది.  బొగ్గు గ‌నుల‌ను బిడ్డింగ్ ద్వారా ద‌క్కించుకున్న సంద‌ర్భాల్లో రాష్ట్రం ఎప్పుడూ పై చేయి సాధించింది. మిగులు విద్యుత్ రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలోకి పోయింది. ఇప్పుడు సింగ‌రేణి గ‌నుల‌కు బ‌కాయిలు చెల్లించ‌కుండా బొగ్గు ఎక్క‌డ దొరికినా కొనండ‌ని చెప్ప‌డం పూర్తిగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: