నింధితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌..కేటీఆర్ సంచ‌ల‌న ట్వీట్..!

హైద‌రాబాద్ సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిపై హ‌త్యాచారానికి పాల్ప‌డిన నింధితుడు రాజు వ‌రంగ‌ల్ ఘ‌ట్ కేస‌ర్ రైల్య్వే ట్రాక్ పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నింధితుడు రాజు కోసం పోలీసులు దాదాపు ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తుండ‌గా తాజాగా ఈ రోజు ఉద‌యం నింధితుడి మృత దేహం ల‌భించింది. నింధితుడి ముఖం పై గుర్తు ప‌ట్ట‌కుండా గాయాలు ఉండ‌గా చేతిపై ఉన్న ప‌చ్చ‌బొట్టు ఆదారంగా నింధితుడిని పోలీసులు గుర్తించారు. 

ఇక ఈ ఘ‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ నింధితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని మొద‌ట ట్వీట్ చేయ‌గా  ఆ త‌ర‌వాత త‌ప్పుడు స‌మాచారం అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు అదే ట్వీట్ కు జోడిస్తూ కేటీఆర్ నింధితుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ ట్వీట్ చేశారు. ఆ దుర్మార్గుడి మృత దేహం స్టేష‌న్ ఘ‌న్ పూర్ రైల్య్వే లైన్ పై ల‌భించిన‌ట్టు స‌మాచారం అందింద‌ని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: