హైద‌రాబాద్ లో మ‌రో దారుణం..నిన్న మాయ‌మైన చిన్నారి నేడు శ‌వ‌మై..!

హైద‌రాబాద్ లో మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే సింగ‌రేణి కాల‌నీలో జ‌రిగిన దారుణాన్ని మ‌ర్చిపోక‌ముందే మ‌రో చిన్నారి అనుమానాస్ప‌దంగా మృతి చెందింది. ఈ దారుణం మియాపూర్ లో చోటు చేసుకుంది. మియాపూర్ ఓంకార్ నగర్ లో నిన్న సాయంత్రం నుండి 13 నెలల చిన్నారి క‌నిపించ‌కుండా పోయింది. అయితే ఆ చిన్నారి ఈ రోజు తెల్ల‌వారుజామున ఇంటి ముందే విగ‌త జీవిగా క‌నింపించింది. అంతే కాంకుడా చిన్నారి క‌ళ్లు పొడిచి ఉన్న‌ట్టుగా పోలీసులు గుర్తించారు. 

పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు చిన్నారి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌పై త‌ల్లి దండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. చిన్నారిని నిన్న కిడ్నాప్ చేసింది ఎవ‌రు..దారుణంగా హ‌త‌మార్చింది ఎవ‌రు అన్నదానిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే సింగ‌రేణి కాల‌నీలో జ‌రిగిన దారుణం పై ప్ర‌జ‌లు బ‌గ్గుమంటుండ‌గా మ‌రో చిన్నారి అనుమానాస్ప‌దంగా మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: