బ్రేకింగ్ : పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..ఇదో హిస్టరీ

Chaganti
టోక్యో పారాలింపిక్ గేమ్స్ చివరి రోజున నోయిడా DM మరియు IAS అధికారి సుహాస్ యతి రాజ్ చరిత్ర సృష్టించారు. జపాన్ లోని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల చివరి రోజు సుహాస్ రజత పతకం గెలుచుకున్నాడు. అలా రజత పతకంతో అతను భారతదేశం యొక్క 18 వ పతకాన్ని సాధించి పెట్టారు. అంతే కాక పారాలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన తొలి ఐఏఎస్ అధికారిగా సుహాస్ నిలిచారు. ఫైనల్లో సుహాస్ 21-15, 17-21, 15-21 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజూర్ చేతిలో ఓడిపోయాడు. సుహాస్ ప్రస్తుతం SL4 కేటగిరీలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆయన శనివారం సెమీ ఫైనల్స్ గెలవడానికి ముందు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడారు మరియు ఒక మ్యాచ్ మినహా అన్నిటిలో ఆధిపత్యం చెలాయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: