వావ్ : ఒకే నగరంలో 107 భాషలు మాట్లాడతారు తెలుసా?

Chaganti
భారత దేశం మొత్తంలో అత్యధిక సంఖ్యలో భాషలు మాట్లాడే జిల్లాగా బెంగళూరు నిలిచింది. ఇద్దరు విద్యావేత్తలు 2011 జనగణన ప్రకారం చేసిన ఇటీవలి విశ్లేషణలో ఇది వెల్లడైంది. బెంగళూరులో కనీసం 107 భాషలు మాట్లాడతారని, ఇందులో 22 షెడ్యూల్డ్ మరియు 84 షెడ్యూల్ కాని భాషలు ఉన్నాయని గుర్తించారు. బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్‌కు చెందిన షమిక రవి మరియు ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ముదిత్ కపూర్ చేసిన విశ్లేషణలో 100 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే ఇతర జిల్లాలు నాగాలాండ్ దిమాపూర్ (103) మరియు అసోంలోని సోనిత్‌పూర్ (101)గా నిలిచాయి. బెంగళూరులో కన్నడ మాట్లాడేవారి మొత్తం శాతం 44%. ఇతర ప్రధాన భాషలు తమిళం (15%), తెలుగు (14%), ఉర్దూ (12%), హిందీ (6%), మలయాళం (3%), మరాఠీ (2%), కొంకణి (0.6%), బెంగాలీ ( 0.6%)) మరియు ఒరియా (0.5%)గా ఉన్నాయి. పోచూరి, కొండ్, సాంగ్టం మరియు వాంచో వంటి భాషలను అతి తక్కువ సంఖ్యలో మాట్లాడేవారు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: