ఒడిశా సీఎంకు ఏపీ సీఎం జ‌గ‌న్ లేఖ‌... కోరిక తీరేనా..!

VUYYURU SUBHASH
ఇటీవ‌ల ఏపీకి పొరుగు రాష్ట్రాల‌తో వ‌రుస‌గా జ‌ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జ‌ల వివాదాల ప‌రిష్కారం కోసం స‌ఖ్య‌త‌తో ఉంటోన్న జ‌గ‌న్ తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. ఇరురాష్ట్రాల మధ్య ఉన్న నీటి ఒప్పందాలు క‌రెక్ట్‌గా అమ‌లు అయ్యేలా చూడాల‌న్న జ‌గ‌న్ వంశధార వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పు ప్రకారం.. నేరడి బ్యారేజ్ నిర్మించుకునేందుకు అనుమతి ఉందన్నారు. ఈ విష‌యంలో చ‌ర్చించేందుకు న‌వీన్‌తో భేటీ కోసం స‌మ‌యం కూడా జ‌గ‌న్ కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని లేఖలో పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: