డార్క్ సర్కిల్స్ ని తగ్గించే బెస్ట్ సొల్యూషన్ ఇదే?

Purushottham Vinay
ఈ డార్క్ సర్కిల్స్ సమస్యకు మార్కెట్లో చాలా రసాయన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే కొన్ని హాని కూడా కలిగిస్తాయి. అలాంటి పరిస్థితిలో, డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఏదైనా వ్యాధికి ఖచ్చితమైన నివారణ ఏంటంటే దాని కారణాన్ని తొలగించడం. ఆహారం తీసుకోవడంలో ఆటంకం, నిద్రలేమి ఇంకా ఒత్తిడి కారణంగా కళ్లపై డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పడతాయి. అందుకే మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవాలి.ఇంకా ఇది కాకుండా యోగా , వ్యాయామాన్ని కూడా ఖచ్చితంగా మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి.ఎందుకంటే దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే యోగా అనేది శరీరంలో శక్తిని ఉంచుతుంది, దీని వల్ల అనేక సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి.


ఈ డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడంలో బాదం నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా కాస్త బాదం నూనెని తీసుకుని కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కు రాసుకుని లైట్ గా మసాజ్ చేయాలి.ఇలా రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఖచ్చితంగా మరింత ప్రయోజనం ఉంటుంది.ఈ కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కు కూడా టొమాటో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా టొమాటో రసాన్ని తీసుకొని అందులో నిమ్మరసం వేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచి, తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఒక వారంలో డార్క్ సర్కిల్స్ ఈజీగా తొలగిపోవడాన్ని మీరు చూస్తారు.ఈ డార్క్ సర్కిల్స్‌తో పోరాడటానికి కీర దోసకాయ రెమెడీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకు ముందుగా కీర దోసకాయను ముక్కలుగా చేసి ఒక అరగంట పాటు ఫ్రిజ్‌లో పెడితే చాలు. వాటిని ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత కళ్లలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మరికొద్ది రోజుల్లో ఎఫెక్ట్ మీకే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: