అన్ని పళ్ళ సమస్యలు తగ్గి తెల్లగా అయ్యే సింపుల్ టిప్?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే చక్కటి చిట్కాను వాడడం వల్ల దంతాలపై ఉండే గార ఇంకా పసుపుదనం తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మారతాయి. ఈ టిప్ ని తయారు చేసుకోని వాడటం కూడా చాలా సులభం. దంతాలను తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటి? ఇంకా దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం లవంగాలను వాడాల్సి ఉంటుంది.దంతాలపై ఉండే పసుపుదనాన్ని తొలగించి దంతాలను తెల్లగా మార్చడంలో అలాగే మన దంతాలు పుచ్చిపోకుండా వాటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి.లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను చంపేసి దంతాల ఇంకా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం మీరు ముందుగా ఒక జార్ లో లవంగాలను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లవంగాల పొడిని అర టీ స్పూన్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచుకుని వేసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పును ఇంకా అలాగే మనం ప్రతిరోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ ను రెండు టీ స్పూన్ల మోతాదులో వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో తీసుకుని మనం సాధారణంగా దంతాలను ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గార, పసుపు అంతా ఈజీగా తొలగిపోయి దంతాలు చాలా తెల్లగా మారతాయి. అలాగే ఈ టిప్ ని వాడడం వల్ల దంతాలు ఇంకా చిగుళ్ల ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. దంతాలు పుచ్చిపోయే దశలో ఉన్నవారు ఈ టిప్ ని రెండు వారాల పాటు వాడడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో నోటి ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: