వృద్దాప్యం త్వరగా రాకుండా ఇవి తినండి?

Purushottham Vinay
చాలా మందికి వృద్దాప్యం త్వరగా వస్తుంది. వృద్దాప్యం త్వరగా రాకుండా చేయాలంటే ఖచ్చితంగా మనం కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. కొన్ని రకాల సూపర్‌ఫుడ్స్ శరీరానికి ఖచ్చితంగా మంచి పోషకాలు అందిస్తుంటాయి. ఇవి అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇంకా 50 ఏళ్లు పైబడిన వారికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ సూపర్‌ఫుడ్‌లు అనేవి ఇమ్యూనిటీ బూస్టర్‌లు అని కూడా చెప్పవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.ఇంకా అలాగే ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.ఇప్పుడు అలాంటి సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, చియా విత్తనాలు ఇంకా అలాగే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.వీటిని తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు ఇంకా అలాగే అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి.


బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా ఇంకా అవకాడో వంటి కూరగాయలు ఫైబర్ కు చాలా అద్భుతమైన మూలం అని చెప్పవచ్చు.ఇందులో ఇండోల్స్, నైట్రైల్స్ ఇంకా అలాగే థియోసైనేట్‌ల వంటి ఫైటోకెమికల్స్‌ ఉంటాయి.వాల్‌నట్‌లు ఇంకా బాదం వంటి గింజలు ప్రోటీన్‌కు చాలా మంచి మూలం. ఇవి మోనోశాచురేటెడ్ కొవ్వులను  కలిగి ఉంటాయి. అలాగే ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి.సాల్మన్, ట్రౌట్ ఇంకా అలాగే హెర్రింగ్ వంటి చేపలలో అధిక స్థాయిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరమైన మంచి కొలెస్ట్రాల్‌ ని అందిస్తుంది. ఈ ఫుడ్ సడెన్ గా వచ్చే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాన్ని చాలా ఈజీగా తగ్గిస్తుంది.అలాగే మీరు ఆకు పచ్చని సూపర్‌ఫుడ్‌లను తినాలనుకుంటే, బచ్చలికూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ ఇంకా కె పుష్కలంగా ఉంటాయి. కెరోటినాయిడ్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇంకా అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: