హెయిర్ ప్రాబ్లెమ్స్ ని అరికట్టే కిచెన్ టిప్?

Purushottham Vinay
ఇక కొన్ని రకాల ఇంటి చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల మనం జుట్టుని బాగా ఒత్తుగా పెంచుకోవచ్చు. కరివేపాకుతో ఆ చిట్కాలను తయారు చేసుకోవచ్చు. ఇక ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం.ఇందుకోసం ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల పెరుగును మీరు తీసుకోవాలి. అలాగే ఆ తరువాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకు పేస్ట్ ను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. అది ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కావల్సిన పోషకాలతో పాటు ఇంకా తేమ కూడా అందుతుంది.అందువల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా అలాగే నీటిలో కరివేపాకును వేసి కషాయంలా తయారు చేసుకోవాలి.ఆ తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇలా రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా శుద్ధి అవుతుంది.


ఇంకా అలాగే రక్తప్రసరణ వ్యవస్థ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. దీంతో జుట్టుకు రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలు కూడా అందుతాయి.దీంతో జుట్టు రాలడం కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే జుట్టు తెల్లబడకుండా కూడా ఉంటుంది. అలాగే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ గోరు వెచ్చని ఆలివ్ నూనెను మీరు తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం ఇంకా ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. అది ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. జుట్టు కాంతివంతంగా అలాగే మృదువుగా తయారవుతుంది. జుట్టు సంబంధిత సమస్యలన్నీ కూడా ఈజీగా తగ్గుతాయి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కరివేపాకును ఈ విధంగా ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: