జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఇలా చెయ్యండి?

Purushottham Vinay
జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా తలస్నానం చేశాక టవల్ ని తలవెంట్రుకలకు చుట్టి ఉంచాలి. ఈ విధంగా కనీసం 30 నిమిషాలపాటు కట్టి ఉంచితే వెంట్రుకల కుదుళ్లను బలంగా చేయడంలోనే కాదు జుట్టు సాప్ట్ గా, సిల్కీగా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే వెంట్రుకలను దువ్వేటప్పుడు కూడా దువ్వెన శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. దాంతో పాటు ఎలాపడితే అలా దువ్వకుండా ఒక క్రమ పద్దతిలో దువ్వుకుంటూ రావాలి. అప్పుడు వెంట్రుకలు రాలడాన్ని తగ్గించవచ్చు. ఫైనల్ గా ఇవన్నీ చేసినప్పటికీ సరైన పోషకాహారం తీసుకోకపోతే అంతా వృథా . కాబట్టి పండ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు లభించి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.కొంచెం గోరు వెచ్చని కొబ్బరినూనెను జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. అందువల్ల జుట్టుకు పోషణ సరిగ్గా లభిస్తుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో తోడ్పడుతుంది. కాబట్టి పదిహేను రోజులకొకసారి అయినా జుట్టుకి గుడ్డుని అప్లై చేయాలి. గుడ్డుని అప్లై చేశాక 10 నుండి 20 నిమిషాలపాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

జుట్టు పెరగడంలోనే కాదు మెరవడానికి కూడా గుడ్డులోని ప్రోటీన్ హెల్స్ చేస్తుంది. కనుక తరచూ గుడ్డును జుట్టుకు రాస్తుండాలి.అయితే గుడ్డుని అప్లై చేయడానికి ఇష్టపడని వారు గుడ్డు స్థానంలో పెరుగును వాడవచ్చు. పెరుగును ఒక బౌల్ లో తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించి 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నెలలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. కలబంద, జొజొబా ఆయిల్ మరియు తేనె ఈ మూడింటిని సమపాళ్లల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి తలస్నానం చేసినట్టయితే మీ వెంట్రుకలలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. అలాగే షాంపూ చేసుకోవడానికి ముందు గోరువెచ్చని నీటితో జుట్టుని కడగాలి. ఇది మీ జుట్టుని పట్టి ఉంచే దుమ్ము, నూనె లాంటి వాటిని పోగొడుతుంది. షాంపూ చేసి ఎలా పడితే అలా రుద్దేయకుండా తలపై వృత్తాకారంలో బాగా రుద్దాలి. దీంతో జుట్టు బాగా శుభ్రపడుతుంది.అంతేగాక బాగా అందంగా ఇంకా ఆరోగ్యంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: