ముఖం కాంతివంతంగా మెరిసిపోయే టిప్స్?

Purushottham Vinay
ఇక పురుషుల కంటే మహిళలు అందరూ కూడా ఖచ్చితంగా వారి ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలి. అందుకోసం వారు ఎన్నో క్రీములను వివిధ రకాల బ్యూటీ క్రీమ్స్ ను, అలాగే పార్లర్కి వెళ్లి వేలవేల ఖర్చులు పెడుతూ ఉంటారు.కొంత మంది మెడిసిన్ కూడా వినియోగిస్తూ ఉంటారు. కానీ అవి రాబోయే రోజులలో స్కిన్ కి హానిచేస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఫేస్ మెరిసిపోవాలి అంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన శరీరం హైడ్రేటుగా ఉండడమే కాకుండా మీ చర్మం తేమ కోల్పోకుండా తాజాగా మెరిసిపోతూ ఉంటుంది.ఇంకా అదే విధంగా దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వలన శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటికి నెట్టివేయబడతాయి. దీని నిత్యము తీసుకోవడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. దీనిలో అలాగే యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలు ఫ్రీడ్ రాడికల్స్ ని చెడిపోకుండా చర్మాన్ని కాపాడతాయి.


ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గ్రీన్ టీ నిత్యము ఒక కప్పు తీసుకోవడం వలన, అవసరంలేని కొవ్వుని బయటికి పంపించేస్తుంది. అలాగే మీ చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది.రాత్రి పడుకునే సమయంలో ముఖం శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మీ ముఖాన్ని సహజమైన కాంతి ని రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై పేర్కొన్న మృతు చర్మాన్ని మురికిని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకుని పొడి బట్టతో తుడుచుకొని పడుకున్నట్లయితే మీ చర్మం ఎంతో సహజ కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ టిప్స్ అన్నిటిని పాటించినట్లయితే మీరు యవ్వనంగా అందంగా మెరిసిపోతూ ఉంటారు.కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యూటీ టిప్స్ పాటించండి. అందంగా మెరిసిపోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: