Citroen C3: బుక్ చేసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్?

Purushottham Vinay
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Citroen భారతీయ మార్కెట్లో ఇటీవల తన కొత్త 'సిట్రోయెన్ సి3' (Citroen C3) విడుదల చేసింది.ఇక దేశీయ మార్కెట్లో ఈ SUV ప్రారంభ ధర రూ.5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 8.06 లక్షలు. కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభించింది. ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..ఇక సిట్రోయెన్ కంపెనీ తన సి3 SUV ని డెలివరీ చేసిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే డెలివరీలు ఎక్కడ జరిగాయి ఇంకా ఎన్ని యూనిట్లు డెలివరీ చేయబడ్డాయి అనే వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అతి త్వరలోనే వెల్లడవుతుంది.ఇక సిట్రోయెన్ కంపెనీ తన కొత్త ఎస్‌యూవీని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి లైవ్ ఇంకా ఫీల్ వేరియంట్. ఈ రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ ఇంకా అలాగే పరికరాలను కలిగి ఉంటాయి. సిట్రోయెన్ సి3 అనేది భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ మొదటి ఉత్పత్తి.


ఈ కొత్త సిట్రోయెన్ సి3 నాలుగు మోనో-టోన్ ఇంకా రెండు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో అందించబడుతుంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్ ఇంకా అలాగే ప్లాటినం గ్రే అనే మోనో కలర్స్ అలాగే జెస్టీ ఆరెంజ్ విత్ ప్లాటినం గ్రే రూఫ్ ఇంకా పోలార్ వైట్‌తో జెస్టీ ఆరెంజ్ కలర్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్స్.ఇక సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, కాగా మరొకటి వచ్చేసి 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.ఇక ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ ఇంకా 115 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్  1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ ఇంకా 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా జత చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: