బజాజ్ చేతక్ : ధర పెంపు విషయంలో షాకింగ్ డెసిషన్?

Purushottham Vinay
ఇక ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ అనేది చాలా బాగా పెరిగింది. అయితే ముడిసరుకు ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో చాలా వరకు కూడా ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి.ఇక ఇప్పుడు బజాజ్ వంతు కూడా వచ్చింది. బజాజ్ చేతక్ స్కూటర్ ధర వచ్చేసి ఇప్పుడు రూ.13,000 పెరిగింది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల జేబుపై పెద్ద భారం అనేది పెంచింది.2019 వ సంవత్సరంలో, బజాజ్ తన ఐకానిక్ స్కూటర్ చేతక్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం జరిగింది. అప్పుడు వారు 14,000 కంటే ఎక్కువ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించారు. మొత్తం 16,000 కంటే ఎక్కువ బుకింగ్ ఆర్డర్‌లు ఉత్పత్తిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, బజాజ్ పూణేలోని అకుర్ది సమీపంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ ప్లాంట్‌ను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో స్కూటర్‌ ధర మరింత పెరిగింది.బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి ప్రస్తుతం రూ. 1,54,181 (ఎక్స్-షోరూమ్) ఉంది.


అంతకుముందు దీని ధర రూ.1,41,440 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే ధర 9.01 శాతం పెరిగింది. స్కూటర్ల ధరలు పెరగడానికి ముడిసరుకు ధరలు పెరగడమే ప్రధాన కారణం అని అంటున్నారు.ఇంకా అలాగే దీంతోపాటు బజాజ్ రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టి కొత్త యూనిట్‌ను కూడా ప్రారంభించింది.ఇక మూడు దశాబ్దాలుగా ఆటోమొబైల్ పరిశ్రమలో పరుగు గుర్రంగా పేరొందిన బజాజ్ చేతక్ స్కూటర్ మూడేళ్ల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు చేతక్ EV స్కూటర్ తయారీకి కొత్త యూనిట్ ని ప్రారంభించింది. పూణేలోని అకుర్డిలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏడాదికి మొత్తం 5 లక్షల స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బజాజ్ గ్రూవ్స్ చైర్మన్ రాహుల్ బజాజ్ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ ని ప్రారంభించబడింది. 70వ దశకంలో చేతక్ స్కూటర్ ప్రారంభమైన ప్రదేశంలోనే ఈ కొత్త యూనిట్ అనేది నిర్మించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: