స్కార్పియో-ఎన్ కొనడానికి మంచి రీజన్ అదే?

Purushottham Vinay
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇటీవలి కాలంలో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఎక్స్‌యూవీ700 (XUV700) ఇంకా స్కార్పియో-ఎన్ (Scorpio-N) రెండూ కూడా మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందాయి.ఈ రెండింటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరసమైన ధర, సుధీర్ఘమైన ఫీచర్స్ ఇంకా విలాసవంతమైన ఇంటీరియర్స్ అలాగే పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉన్నప్పటికీ ఈ మోడల్‌ను కొత్తగా వచ్చిన మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని ఎంచుకోవడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ700  మోడ్రన్ మోనోకోక్ ఛాసిస్‌కు బదులుగా మహీంద్రా స్కార్పియో-ఎన్ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్‌ పై ఆధారపడి తయారు చేయబడింది. కాబట్టి, ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 కంటే కొత్త స్కార్పియో-ఎన్ చాలా కఠినమైనదిగా ఉంటుంది. ఇంకా అలాగే అత్యుత్తమ ఆఫ్-రోడ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు ప్రయాణించే మార్గంలో మట్టి రోడ్లు ఇంకా బీట్ ట్రయల్స్‌ లాంటివి ఉన్నట్లయితే మీరు మహీంద్రా ఎక్స్‌యూవీ700 కంటే మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయం.


ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ కార్ ని కంపెనీ ఆల్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌తో అందించినప్పటికీ, సరికొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో కనుక పోల్చితే, ఇది ఇంత సమర్థవంతంగా ఉండదు. ఎందుకంటే, కొత్త తరం స్కార్పియో-ఎన్ వెనుకవైపు మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో బ్రేక్ లాక్ డిఫరెన్షియల్ ఉంటుంది. ఈ విభిన్నమైన డిఫరెన్షియల్ సిస్టమ్‌ కారణంగా కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆఫ్-రోడ్ ట్రాక్ లపై మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్ కంటే శక్తివంతమైనదిగా ఉంటుంది.మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇంకా మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండూ కూడా ఒకే విధమైన ఇంజన్ ఆప్షన్లను ఉపయోగిస్తున్నప్పటికీ, స్కార్పియో-ఎన్ మాత్రం ఎక్స్‌యూవీ700 కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్ వేరియంట్ కంటే మహీంద్రా స్కార్పియో-ఎన్  పెట్రోల్ వేరియంట్ 3 బిహెచ్‌పి ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఇంకా ఇది స్కార్పియో-ఎన్ ను అత్యంత శక్తివంతమైన మహీంద్రా ఎస్‌యూవీగా మార్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: