ఇక కుటుంబం ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి సందర్భంలోనూ కుటుంబం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది.అయితే కరోనా వైరస్ లాంటి మహమ్మారి మన జీవితాల నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంతో సరదాగా గడపాలని ఇంకా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక ఎక్కువ మంది కూర్చోగలిగే ఫ్యామిలీ కారును కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, చక్కటి MPV (multi-purpose vehicles) ఫ్యామిలీ కార్ల గురించి మనం తెలుసుకుందాం. అయితే వాటి ధర గురించి భయపడాల్సిన పనిలేదు. ఈ ఎంపీవీ మోడల్ కార్లు ఖచ్చితంగా అనుకూలంగా మీ బడ్జెట్‌లోనే ఉన్నాయి.Kia నుంచి వచ్చిన Kia Carens, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంఫర్ట్ గా కూర్చోగలిగే అవకాశం ఉన్న కారు. ఇక దీని ధర గురించి చెప్పాలంటే, Kia లోని ఈ మోడల్ ధర రూ. 8.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కియాకు చెందిన Kia Carens మోడల్ మీకు సౌకర్యవంతమైన 7 సీట్లతో వస్తోంది. అలాగే ఈ మోడల్ కారు కంపెనీ అప్ డేటెడ్ ఫీచర్లను కూడా అందిస్తుంది. అలాగే ఈ కారులో సన్‌రూఫ్ కోసం వెంటిలేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇక మారుతి సుజుకి భారతీయ కస్టమర్ల మొదటి ఎంపిక. మారుతీ కంపెనీ తన కస్టమర్ల వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల మోడళ్లను కూడా అందిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా అనేది మారుతి సుజుకి నుండి వచ్చిన మంచి ఫ్యామిలీ కార్ మోడల్. ఈ కంపెనీ కొంతకాలం క్రితం 7-సీటర్ MPVని పరిచయం చేసింది. ఇక మీ బడ్జెట్ 10 లక్షల వరకు ఉంటే, మీరు ఈ కారును ఈజీగా కొనుగోలు చేయవచ్చు. మారుతి నుండి ఈ నవీకరించబడిన మోడల్ అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్‌ట్రెయిన్ ఇంకా అలాగే కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది.అలాగే వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా & మహీంద్రా కూడా 10 లక్షల బడ్జెట్‌లో ఫ్యామిలీ కార్ మోడళ్లను అందిస్తోంది. మహీంద్రా బొలెరో నియో ఈ కంపెనీ ఉత్తమ కుటుంబ కారు. 7 సీట్ల బొలెరో నియోలో కంపెనీ బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఇంకా అలాగే రియర్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌ను అందిస్తుంది. BS6 ఇంజిన్ 1 లీటర్ చమురు వినియోగంలో 17 కిలోమీటర్ల వరకు ఈ కార్ మైలేజీని ఇవ్వగలదు