క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన టొయోటా అర్బన్ క్రూయిజర్!

Purushottham Vinay
మారుతి సుజుకి అమ్ముతున్న విటారా బ్రెజ్జా (Vitara Brezza) కాంపాక్ట్ ఎస్‌యూవీని అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser) పేరుతో టొయోటా కూడా అమ్ముతున్న సంగతి తెలిసినదే. నిజానికి, ఇవి రెండూ కూడా వేర్వేరు బాడీ ప్యానెళ్లతో లభించే ఒకే రకం కార్లు.ఇక తాజాగా ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. గతంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కోసం నిర్వహించిన క్రాష్ టెస్టులో బ్రెజ్జా కూడా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌నే దక్కించుకోవడం జరిగింది.ఇక ఈ క్రాష్ టెస్టులో టొయోటా అర్బన్ క్రూయిజర్ పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గానూ 13.52 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్‌గా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవడం జరిగింది. ఇక పిల్లల భద్రత విషయానికి వస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ మొత్తంగా 49 పాయింట్లకు గాను 36.68 పాయింట్లను స్కోర్ చేసింది. పిల్లల సేఫ్టీ విషయంలో మాత్రం ఇది ఐదు స్టార్లకు గానూ కేవలం 3 స్టార్లని మాత్రమే దక్కించుకుంది.


రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లు, ముందు సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఇంకా అలాగే చైల్డ్ సీట్‌లను మౌంట్ చేయడానికి ISOFIX యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగిన బేస్ మోడల్ టొయోటా అర్బన్ క్రూయిజర్ ను గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) టీం ఈ టెస్టింగ్ ప్రాసెస్ కోసం ఉపయోగించింది. ఈ మోడల్‌లో పైన తెలిపిన సేఫ్టీ ఫీచర్లు తప్ప వేరే ఏ ఎక్స్ ట్రా సేఫ్టీ ఫీచర్లు కూడా లేవు.ఇక ఈ క్రాష్ టెస్టులో టొయోటా అర్బన్ క్రూయిజర్ ను ముందు వైపు నుండి మాక్సిమం గంటకు 64 కిలోమీటర్ల వేగంతో క్రాష్ టెస్ట్ చేశారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన ఈ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్ లో టొయోటా అర్బన్ క్రూయిజర్ డ్రైవర్ ఇంకా ప్రయాణీకుల తలలు ఇంకా మెడలకు మంచి రక్షణను అందించినట్లు గుర్తించబడింది. అలాగే, ముందు ప్రయాణీకుడి ఛాతీకి మంచి రక్షణ అనేది కూడా అందించింది. అయితే, ఈ ప్రమాదంలో మాత్రం డ్రైవర్ ఛాతీకి మాత్రం తగిన రక్షణ ఉండదని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: