మంచి ఎలక్ట్రిక్ కార్ కావాలా? అయితే ఇది కొనండి..!!

Purushottham Vinay
పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ ల్ ధరలను తలుచుకుంటేనే గుండె గుభేల్ అనే స్థాయికి చేరుకుంది. ఇక ఈ నేపథ్యంలో  దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ చాలా ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలతో దేశీయ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తుండగా, MG Motor india కూడా కొత్త కార్లతో మార్కెట్లోకి వస్తోంది. తాజాగా MG మోటార్ ఇండియా ZS-EV (MG Motors ZS-EV) కొత్త వెర్షన్‌ను దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. MG Motors ZS-EV ని కనుక ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ మైలేజీ ని అందిస్తోంది. అంటే సుమారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా కేవలం ఒకసారి ఛార్జీ చేయడం ద్వారా వెళ్ళవచ్చు. ఇది 50.3 kWh అతిపెద్ద, సురక్షితమైన ఇంకా అలాగే ఎంతో అత్యంత శక్తివంతమైన బ్యాటరీని కూడా కలిగి ఉంది. ZS-EV షోరూమ్ ధర రూ. 21.99 లక్షలతో స్టార్ట్ అవుతుంది.


ఇక ఈ కొత్త ZS EV రెండు వేరియంట్‌లలో మనకు లభిస్తుంది - ఎక్సైట్ ఇంకా అలాగే ఎక్స్‌క్లూజివ్, దీని ధరలు వచ్చేసి వరుసగా రూ. 21.99 లక్షలు ఇంకా అలాగే రూ. 25.88 లక్షలుగా ఉన్నాయి.ఇక ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ కోసం బుకింగ్ స్టార్ట్ చేసామని ఎక్సైట్ ట్రిమ్ బుకింగ్‌లు జూలై 2022 నుండి స్టార్ట్ అవుతాయని కంపెనీ తెలిపింది. ZS EVకి డిమాండ్ ప్రోత్సాహకరంగా ఉందని ఇంకా అలాగే కొత్త వేరియంట్ కస్టమర్లతో బ్రాండ్ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని MG మోటార్ ఇండియా ఛైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. UK, యూరప్ ఇంకా అలాగే ఆస్ట్రేలియాతో సహా కీలక ప్రపంచ మార్కెట్లలో  ZS EV (MG Motors ZS-EV) విజయవంతమైందని ఆయన తెలిపడం జరిగింది.


ఇక ఈ కారు ఫీచర్ల విషయానికి కనుక వస్తే ZS-EV (MG Motors ZS-EV) పూర్తిగా కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బ్యాటరీతో ఆధారితమైనది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డ్రైవ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, ESC, TPMS ఇంకా అలాగే అనేక ఇతర గొప్ప ఫీచర్లు అనేవి ఉన్నాయి. ZS-EV iSmart నుండి 75కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఈ ఫీచర్లను అందిస్తుంది.ఇక ఈ ZS-EVని 2 సంవత్సరాల పాటు నడపడం వల్ల 70 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు గాల్లో విడుదల కాకుండా ఆదా అనేది అవుతుంది. ఇది 42 వేల చెట్లను నాటడంతో సమానం అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

EV

సంబంధిత వార్తలు: