పెరిగిన హోండా బైక్స్ సేల్స్.. వివరాలు..

Purushottham Vinay
ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా బైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ముఖ్యంగా ఇండియాలో వీటి వాడకం రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి. ఎన్ని బైక్స్ పోటీగా వున్న హోండా బైక్స్ కి సాటి రావనే చెప్పాలి. 'హోండా మోటార్‌సైకిల్ ఇండియా' తన 2021 జూన్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసింది.ఇక హోండా కంపెనీ విడుదల చేసిన ఈ అమ్మకాల గణాంకాల ప్రకారం, మొత్తం 2,34,029 టూ వీలర్ బైక్స్ ని అమ్మినట్లు తెలిసింది.ఇక ఇదే విధంగా గత సంవత్సరం మార్కెట్లో అమ్మిన మొత్తం బైక్స్ అమ్మకాలు 2,10,879 అని గత నివేదికల ద్వారా తెలిసింది.హోండా మోటార్‌ బైక్స్ అమ్మకాలు గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు దాదాపు 11 శాతం పెరిగాయి. మొత్తం కంపెనీ అమ్మిన 2,34,029 యూనిట్లలో 2,12,446 యూనిట్లను దేశీయ మార్కెట్లో అమ్మినట్లు తెలిసింది.ఇక మిగిలిన 21,583 యూనిట్లు ఫారిన్ దేశాలకు ఎగుమతి అయినట్లు కూడా నివేదికల ద్వారా తెలిసింది.

ఇక గత సంవత్సరం జూన్ నెలలో హోండా మోటార్ బైక్స్ దేశీయ మార్కెట్లో 2,02,837 యూనిట్ల వాహనాలను అమ్మగా,మొత్తం 8,042 యూనిట్ల బైక్స్ ని విదేశీ మార్కెట్ కి ఎగుమతి చేశాయి.ఇక ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా , దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్‌లు క్రమంగా ఓపెన్ చేయడం వల్ల ఈ సంవత్సరం జూన్ నెలలో టూ వీలర్ల డిమాండ్‌  కొంత పెరుగుదల దిశగా వెళ్తోంది.ఇక ఈ కంపెనీ మోటార్ బైక్స్ అమ్మకాల గురించి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్ లు 95 శాతం వరకు స్టార్ట్ చేయబడ్డాయి. అదేవిధంగా కంపెనీ అమ్మకాలను పెంచడానికి ఇంకా ఉత్పత్తిని మరింత వేగవంతం చేయడానికి, మొత్తం 4 ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను పెంచుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: