భారీగా తగ్గిన ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర...

Purushottham Vinay
ప్రముఖ ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఏథర్ ఎనర్జీ అందిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీగా తగ్గాయి. తాజాగా ధరల తగ్గింపు తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.32 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది.ఇక ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఏథర్ 450 అనే స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తోంది.ఇక ఇది రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంటుంది. అవి.. ఒకటి ఏథర్ 450 ప్లస్ ఇంకోటి ఏథర్ 450ఎక్స్.ఇక ఈ రెండింటిలో ఏథర్ 450ఎక్స్ స్కూటర్ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఇక అలాగే ఈ మోటర్ మాక్సిమమ్ 26 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది అలాగే ఈ బ్యాటరీ ప్యాక్ ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉండటం విశేషం.

ఇక ఈ ఏథర్ 450ఎక్స్ స్కూటర్ స్పేస్ గ్రే, వైట్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో మనకు లభిస్తుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం కూడా 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని, ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు మనం ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపడం జరిగింది.ఇక ముఖ్యంగా అన్నిటికన్నా ఈ ఎథర్ 450ఎక్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే...ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చాలా ఈజీగా చేరుకోగలదు.ఇక దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి దీని వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక ఇందులోని బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై మాక్సిమమ్ 85 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: