Yamaha FZ X బుకింగ్స్ ప్రారంభం...

Purushottham Vinay
ప్రముఖ బైక్ కంపెనీ యమహా,ఇండియా మార్కెట్లో కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగాంగానే యమహా తన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ విడుదల తేదీ ఇటీవల వెల్లడించడం జరిగింది.ఇండియాలో విడుదల కానున్న ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.ఇక యమహా కంపెనీ తెలిపిన వివరాలు ప్రకారం, ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ 2021 జూన్ 18 న వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయబడుతుంది. ఇప్పుడు యమహా డీలర్లు కొత్త మోడల్ కోసం అన్ ఆఫీషియల్ బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు. ఇక ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఇప్పుడు ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ను రూ. 1000 నుంచి రూ. 10,000 వరకు బుక్ చేసుకోవచ్చు.

ఇక లాంచ్ అయిన తర్వాత మోడల్‌తో కస్టమర్లు సంతృప్తి చెందకపోతే, టోకెన్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇస్తామని డీలర్లు వెల్లడించారు.ఇక జూన్ 18 న లాంచ్ అయిన తర్వాత ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్ డెలివరీలు ఆగస్టు స్టార్టింగ్ లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇక రెట్రో లాంటి మోడల్ ధర సుమారు 1.04 లక్షల రూపాయలు. అంటే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 5,000 ఎక్కువగా వుంది.ఇక ఈ సరి కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇది టియర్ ఐ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌తో లేటెస్ట్ రిట్రో డిజైన్ కలిగి ఉండటం విశేషం.

ఇక కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ రోడ్‌స్టెర్ డిజైన్ కారణంగా ట్యాంకుకు ఫెయిరింగ్ ఇంకా ట్రిమ్ లేదు. అయితే దానికి బదులు మధ్యలో బ్లాక్ అవుట్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.ఈ కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. కాబట్టి దీనికి అనుకూలంగా ఉండే ఒక మంచి సీటింగ్ కూడా ఉంటుంది. ఇది విస్తృత హ్యాండిల్ బార్ అలాగే ఫుట్‌పెగ్ కలిగి ఉంది.ఇంకా ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: