త్వరలో రాబోతున్న న్యూ సుజుకి విటారా...

Purushottham Vinay
జపనీస్ కార్ బ్రాండ్ సుజుకి నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లలో దూసుకుపోతున్న విటారా ఎస్‌యూవీ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే ఎస్‌యూవీని మన దేశంలో విటారా బ్రెజ్జా పేరుతో మారుతి సుజుకి అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే.ఈ కొత్త మోడల్ అందమైన డిజైన్ మార్పులు ఇంకా మంచి అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. వచ్చే అక్టోబర్‌లో కొత్త విటారాను తెస్తామని , ఏడాది చివరినాటికి లేదా 2022 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్ అమ్మకాలు స్టార్ట్ చేస్తామని కంపెనీ వారు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ కొత్త సుజుకి విటారా చాలా అగ్రెసివ్ వైఖరితో ఉంటుంది. ఈ కొత్త విటారా ఇంటర్నేషనల్ మార్కెట్లలో కియా సెల్టోస్, హ్యుందాయ్ కోనా, టొయోటా సి-హెచ్ఆర్ మొదలైన వాటికి పోటీగా ఉంటుంది. సుజుకి ఈ ఏడాది యూరప్ లో ప్రవేశపెట్టబోయే మూడు కొత్త మోడళ్లలో కొత్త విటారా కూడా ఒకటి అవుతుంది.
ఈ కొత్త విటారా ఎస్‌యూవీలో ఇందులో సరికొత్త మల్టీమీడియా సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను యాడ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్ మరియు మెరుగైన మెటీరియల్ క్వాలిటీ లభిస్తుందని భావిస్తున్నారు. 1.4-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుందని సమాచారం. కాకపోతే, ఈ ఇంజన్ ఆప్షనల్ ఆల్‌గ్రిప్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ అలాగే ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తోంది.
ఇక ఇది హైబ్రిడ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుందని, ఇందులో 10 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు, 48-వోల్ట్ బ్యాటరీలు ఇంకా మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు లభిస్తాయని సమాచారం.ఎంట్రీ లెవల్ వేరియంట్లలో 1.0 ఎల్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండబోతుందట..ఖచ్చితంగా ఈ కార్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ఇక ధర మిగిలిన విషయాలు గురించి కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: