త్వరలో మార్కెట్ లోకి న్యూ మారుతి సెలెరియో..

Purushottham Vinay
మారుతి సుజుకి కార్లకు ఇండియాలో ఎంత మంచి డిమాండ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్య తరగతి ప్రజలకు అనూకూలమైన ధరలలో ఈ కార్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఇండియా నుండి రానున్న రోజుల్లో కొన్ని కొత్త మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో ముందుగా కొత్త మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ రానుంది.నిజానికి ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లోకి రావల్సి ఉండగా,కరోనా వైరస్ ప్రభావం కారణంగా లేట్ అయ్యింది.

ఇక ఈ కొత్త మరుతి సుజుకి సెలెరియోలో కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పాటుగా ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది అప్‌డేటెడ్ డిజైన్ ఇంకా సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. మారుతి ఆల్టో కన్నా కాస్తంత మెరుగైన కార్ కోరుకునే వారికి సెలెరియో ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. కొత్తగా రాబోయే ఈ రెండవ తరం సెలెరియోని కంపెనీ సరికొత్త ప్లాట్‌ఫామ్‌తో ప్రారంభించడానికి సన్నద్ధమైంది.ఇది హార్టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది.

ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా, ఈ కొత్త కారులో మునుపటి కన్నా మరింత మెరుగైన క్యాబిన్ స్థలం ఉంటుంది.ఇందులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, కొత్త తరం వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆఫర్ చేస్తున్న పవర్‌ఫుల్ 1.2-లీటర్ కె12 ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.ఈ కొత్త మారుతి సుజుకి సెలెరియోలో కేవలం ఎక్స్టీరియర్‌లోనే కాకుండా ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. ఇందులో క్యాబిన్ లేఅవుట్‌ని పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఇంకా ఇందులో బ్రాండ్ లేటెస్ట్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా ఉంటుంది.

ప్రస్తుత 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద ఎక్కువగా 68 బిహెచ్‌పి పవర్‌ను ఇంకా 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్‌ను ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే, పెద్ద 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద ఎక్కువగా 82 బిహెచ్‌పి శక్తిని అలాగే 4200 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.ఈ రెండు ఇంజన్లు కూడా ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యే అవకాశం ఉంది.

ఈ సెకండ్ జనరేషన్ సెలెరియోలోని లోయర్-స్పెక్ 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లలో కూడా కంపెనీ పెట్రోల్-సిఎన్‌జి వేరియంట్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.ఈ కార్ లోపల ఇంకా బయట కంప్లీట్ రీడిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎక్స్టీరియర్ మార్పులలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో రీడిజైన్ చేయబడిన బంపర్‌లు మొదలైన మార్పులు ఉంటాయట.ఇక దీని ధర ఇంకా ఇతర విషయాలు త్వరలో కంపెనీ వెల్లడించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: