గ్రేట్ ఐడియా బాసూ.. భలే ఉంది కదూ...!

Satvika
ఆలోచన ఉంటే ఎవరెస్ట్ ను అయిన ఎక్కవచ్చు అని పెద్దలు అంటారు. అది కూడా చాలా మంది నిరూపించారు. శాస్త్రవేత్తలకు రాని కొత్త పద్ధతుల ద్వారా కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు. అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఒక టైర్లు లేని ట్రాక్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వ్యవసాయం కోసం ఓ వ్యక్తి చేసిన ఆలోచన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. టైర్లు లేకుండానే వాహనాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఆ ట్రాక్టర్ తో మంచిగా వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. అసలు ఆ ట్రాక్టర్ కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నూతన మోడల్ టైర్లు లేని ట్రాక్టర్ అందరికీ ఆకట్టుకుంటుంది. ఖమ్మం వైపు నుంచి హైదరాబాద్ వేళ్లే రహదారిపై మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ఈ ట్రాక్టర్‌ను నడుపుకుంటూ తీసుకెళ్లారు. దీనికి టైర్లు లేకుండా ఎండ్ల బండి లాంటి చక్రాలు ఉండటంతో గ్రామస్తులు దీనిని చూసేందుకు ఎగబడ్డారు. ఇప్పటివరకు ఇలాంటి చక్రాలు ఉన్న ట్రాక్టర్‌ను చూడలేదని, ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ ట్రాక్టర్‌తో పత్తి, మిరప, మొక్కజొన్న చేలల్లో పాట్లు వేస్తే చెట్లు విరగకుండా ఉంటాయని యజమాని చెప్పాడు.


అంతేకాదు, ఇలాంటి ట్రాక్టర్ ను కంపెనీలు తయారు చేయడం లేదని ఆయనే ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు..వీటిని తయారు చేసే వ్యక్తి కోదాడలో ఉన్నట్లు తెలిపారు. దీన్ని రూ.70 వేలు పెట్టి తయారు చేయించినట్టు తెలియజేశాడు.గతంలో ఎద్దులతో అరక కట్టి పాటు చేస్తే ఒక అరక దున్నే వ్యక్తితో పాటు ఇద్దరు కూలీలు అవసరమయ్యేవారని, చెట్లు విరిగితే వాటిని లేపడానికి వారు అరక వెనుకాలే ఉండాల్సి వచ్చేదని తెలిపాడు. ఈ ట్రాక్టర్‌తో చెట్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందని అన్నాడు. ఖర్చు కూడా చాలా తగ్గుతుందన్నాడు. పని కూడా సులువుగా అవుతుందని అన్నాడు.. ఈ ట్రాక్టర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. చెట్లు చావకుండా ఉంటాయని అంటున్నారు.. ఇప్పుడు ఈ ట్రాక్టర్ అందరికీ ఆదర్శంగా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: