బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే పెట్రోల్ వేరియంట్ లాంఛ్.. ధర మాత్రం..!!

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీల లో బీఎండబ్ల్యూ కంపెనీ ప్రముఖమైంది... అధిక ఖర్చు తో పా టుగా స్టైల్ లుక్ తో ఉంటుంది. ఈ కంపెనీ కార్లను కొనడానికి ఎక్కువగా సినీ తారలు , సెలెబ్రెటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మార్కెట్ లో ఈ కార్లకు డిమాండ్ మాత్రం అప్పటికి ,ఇప్పటికీ తగ్గలేదు.. ఈ కంపెనీ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో మరో కారును విడుదల చేసింది.

బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే పెట్రోల్ వేరియంట్ లో లాంఛ్ చేసింది..ఈ కారు ముందొచ్చిన కార్ల కంటే అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంటుంది..ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.41.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. చెన్నైలో అసెంబుల్ చేసిన ఈ వాహనం లోకల్ మేడ్ గా గుర్తింపుతెచ్చుకుంది. బీఎండబ్ల్యూ2 సిరీస్ గ్రాన్ కూపే 220ఐ స్పోర్ట్ మోడల్ ను ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్ల వద్దకు చేరుకుంది. బుకింగ్స్ ప్రారంభమవగా త్వరలోనే కారు డెలివరీలు కూడా అందుబాటులో రానున్నాయి.

2.0-లీటర్ నాలుగు సిలీండర్ల ట్విన్ పవర్ టర్బో ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 190 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 280 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 1350-4600 ఆర్పీఎం నుంచి 8-స్పీడ్ స్టెప్ ట్రోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.వీటితో పాటుగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం కూడా చేయవచ్చు..ఈ కారుకు వాహనం 12.3-అంగుళాల ఇంఫోటైన్మెంట్ సిస్టంతో పాటు యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రేర్ ఏసీ వెంట్స్, స్పోర్ట్స్ సీట్లు, ఎలక్ట్రిక్ మెమొరీ ఫంక్షన్, పానోరామిక్ గ్లాస్ రూఫ్ లాంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది..దీంతో కారుకు ఫ్రీ బుకింగ్ లు ప్రారంభం అయ్యాయి. మార్కెట్ లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: