టీవీఎస్ ఎన్ టార్క్ 125 బైక్ కు ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు గా .. కారణం?

Satvika
భారత దేశ ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలలో ఒకటి టీవీఎస్.. ఈ కంపెనీ నుంచి ఎన్నో బైక్ లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మార్కెట్ లో వాటికి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది..ఎప్పుడు కొత్త బైక్ లను లాంఛ్ చేసినా కూడా భారీగా సెల్ అవ్వడం తో పాటుగా ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. ఇటీవల ఈ కంపెనీ నుంచి మార్కెట్ లోకి వచ్చిన స్కూటర్ టీవీఎస్ ఎన్ టార్క్ 125..ఈ బైక్ స్పెసిఫికేష న్ లు వల్ల మార్కెట్ లో వీటికి డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.. అంతగా ఈ బైక్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


ఎటూ చూసిన డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, స్మార్ట్ కనెక్ట్ స్మార్ట్ ఫోన్ పెయిరింగ్, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా 12-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఇంజిన్ కిల్ స్విచ్. యూఎస్బీ ఛార్జర్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్లో థ్రోటీ ఎక్సాహాస్ట్ నోట్ తో పాటు ఇతర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇవికాకుండా ఈ స్కూటర్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, కాయిల్ కవర్ స్ప్రింగ్ రేర్ ఉంది.బ్రేకింగ్ సెటప్ కూడా కొత్త మోడల్ లో ఉంటుంది..



ప్రస్తుతం ఈ బైక్ కలర్ యెల్లో మాత్రమే అందుబాటులో ఉంది..షోరూంలో టీవీఎస్ ఎన్ టార్క్ రేస్ ఎడిషన్ స్కూటర్ ధర వచ్చేసి రూ.74,365లుగా సంస్థ నిర్దేశించింది.స్పోర్టీ అగ్రెసివ్ లుక్ తో ఉండి ఫ్లాగ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ టీవీఎస్ రేసింగ్ అనే రేస్ ఎంబ్లతో పాటు ఇతర కీలక మార్పులను చేసింది.. ఆకట్టుకొనే ఆకారం.. అదిరిపోయే మైలేజ్ లు ఉన్న  ఈ బైక్ తప్పకుండా వాహన దారులకు నచ్చిన విధంగా ఈ బైక్ ఉండటంతో మార్కెట్ లో డిమాండ్ ఇంకా తగ్గట్లు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. యెల్లో తో పాటుగా మరి కొన్ని కలర్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: