ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధర ఎంతో తెలుసా..?

Kothuru Ram Kumar
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్న మోడళ్లలో బుల్లెట్ కూడా ఒకటి. అయితే, కాలానుగుణంగా, కంపెనీ ఇందులో అనేక మార్పులు చేర్పులు చేస్తూ, మారుతున్న ట్రెండ్, టెక్నాలజీకి అనుగుణంగా దీనిని అప్‌గ్రేడ్ చేస్తూ వస్తుందని నిపుణులు తెలిపారు.

అయితే ఇంజన్ పరంగా ఈ మోడల్‌లో అదే పాత 346సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 19.1 పిఎస్ పవర్‌ను 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మార్కెట్లో బుల్లెట్ 350కి గట్టి పోటీనిచ్చే మోడల్ ఏదీ లేదు, ఎందుకంటే ఈ విభాగంలో చాలావరకు సబ్ 400 సిసి బైక్‌లు కాస్తంత అధిక ధరను కలిగి ఉంటాయన్నారు.

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ భారత మార్కెట్‌కు మరో సరికొత్త క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్‌ను పరిచం చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 పేరుతో కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ప్రస్తుత థండర్‌బర్డ్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని భర్తీ చేయనుందని తెలిపారు.

అంతేకాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో కొత్త 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ని 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుందని తెలిపారు.

అంతేకాక రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది వరుసగా రెండోసారి బుల్లెట్ ధరలను పెంచడానికి గల కారణాలను కంపెనీ వివరించలేదన్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయన్నారు. ఇదే కోవలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తమ బుల్లెట్ 350 ధరలను పెంచినట్లుగా నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: