రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బుకింగ్స్ ప్రారంభం!

Durga Writes

రాయల్ ఎన్‌ఫీల్డ్ .. ఎంతోమంది మధ్యతరగతి యువకుల కల ఇది.. కొనాలి అని ఉన్న సరే.. ధర చూసి వెనకడుగు వెయ్యాలి.. ఎందుకంటే మధ్య తరగతి తండ్రి 4 నెలలు సంపాదన ఆ బైక్ ఖరీదు. అయినప్పటికీ ఆ బైక్ ని చూడటానికి.. ఆ బైక్ లో వచ్చే కొత్త మోడల్స్ చూడటానికి యువకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే మనదేశంలో అమ్మాయిల నుండి అబ్బాయిల వరుకు ప్రతి ఒక్కరు ఇష్టపడే రాయల్ ఎన్ఫీల్డ్ నుండి మరో కొత్త బైక్ వస్తుంది. ఆ బైక్ చూస్తే వావ్ అనాల్సిందే. ఆలా ఉంది ఆ బైక్. అసలు ఆ బైక్ ఏంటి అనుకుంటున్నారా ? ఇంకేంటి అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 క్లాసిక్ 500 ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. 

 

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ మరియు థండర్బర్డ్ సహా 499 సిసి ఇంజిన్‌తో అన్ని మోడళ్ల ఉత్పత్తిని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ ఈ మర్చి 31 తేదీన ముగించేయనుంది. అయితే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ ఈనెల 10 నుండి భారతదేశంలో అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు ప్రకటించాయి. 

 

అయితే ఈ నేపథ్యంలోనే భారత్ మార్కెట్లో ఈ క్లాసిక్ 500 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ అమ్మకం పరిమిత సంఖ్యలోనే కస్టమర్లకు అందించడం జరుగుతుంది. అయితే చూడటాన్ని ఈ క్లాసిక్ 500 అదిరిపోయింది.. అదిరిపోయే లుక్స్ తో ఈ బైక్ ప్రస్తుతం ప్రజల ముందుకు వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: