అదిరిపోయే ఫీచర్లతో టాటా CNG కార్లు?

Purushottham Vinay
ఈ కాలంలో ఎలక్ట్రిక్ కార్లు ఇంకా బైక్లను చాలా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.ఇంకా అలాగే వీటితో పాటు సీఎన్ జీ(CNG) వాహనాలు కూడా ఈరోజుల్లో ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో హారియర్ ఈవీ, సియెర్రా ఈవీ ఇంకా అలాగే అవిన్యా ఈవీ కాన్సెప్ట్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఇంట్రడ్యూస్ చేసింది.ఇంకా అలాగే వీటితోపాటు తన రెండు ఫేమస్ మోడల్స్ అయిన టాటా ఆల్ట్రోజ్, పంచ్ మినీ ఎస్ యూవీ సీఎన్జీ వెర్షన్‌లను కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ రెండు సీఎన్ జీ కార్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..ఇక ఈ టాటా ఆల్ట్రోజ్ సీఎన్ జీ1.2L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్ జీ కిట్‌ తో అందుబాటులోకి వస్తుంది. సీఎన్ జీ పై ఈ ఇంజిన్ ను రన్ చేసినప్పుడు మోడల్ పవర్ అవుట్‌పుట్‌లో కొంచెం తగ్గుదల (10bhp -15bhp) అనేది ఉంటుంది.


ఇంకా అదే రెగ్యులర్ పెట్రోల్ తో అయితే 110bhp టాప్ పవర్ ఇంకా 140Nm మాక్సిమం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఇది  స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫ్యూయల్ పవర్ కలిగి ఉంటుంది. ఈ cng హ్యాచ్‌బ్యాక్ కార్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ను కూడా అందిస్తుంది.అలాగే టాటా పంచ్ సీఎన్ జీ వెర్షన్ కు గత సంవత్సరం పలు పరీక్షలు పెట్టడం జరిగింది. ఇప్పుడు దీనిని కూడా ఆటో ఎక్స్‌పో 2023లో పెర్ఫార్మ్ చేశారు. ఈ సీఎన్ జీ మోడల్ కూడా పెట్రోల్ మోడల్ లాగే అదే 1.2L 3-సిలిండర్ రివాట్రన్ ఇంజిన్‌తో పని చేస్తుంది. అయితే, పవర్ ఇంకా టార్క్‌లో కొంచెం తగ్గుదల అనేది ఉంటుంది. సీఎన్ జీ మోడ్‌లో, ఇది 70-75bhp, 100Nm మాక్సిమం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ కార్ మైలేజ్ సుమారు 30కిమీ/కిలో ఉంటుంది.ఆల్ట్రోజ్ సీఎన్ జీ లాగే ఈ కార్ కూడా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: