కాజ‌ల్ అనౌన్స్ మెంట్ దాని గురించేనా?

Dabbeda Mohan Babu
త‌క్కువ కాలంలో పెద్ద హీరోయిన్ గా ఎదిగిన వారిలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. ప్ర‌స్తుతం కాజ‌ల్ గురించి ప్ర‌త్యేకంగా ఎలాంటి ప‌రిచాయాలు అక్క‌ర్లేదు. అంత‌గా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో కాజ‌ల్ ఒదిగిపోయింది. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ అగ్ర క‌థ నాయ‌క ఎవ‌రు అంటే మొద‌టి పేరు.. కాజ‌ల్ పేరే విన‌ప‌డేది. ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్ర‌తి భాషలోని సినిమాల్లో కాజ‌ల్ మెరిసింది.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అయితే కొన్ని రోజుల క్రితం కాజ‌ల్ పెళ్లి చేసుకోవ‌డంతో కొద్ది రోజుల కాస్త రెస్ట్ తీసుకున్నారు. ఆ కొద్ది పాటి రెస్ట్ త‌ర్వాత సినిమాలు చేయ‌డంలో స్పీడ్ పెంచారు. కాగ ముంబాయ్ కి చెందిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్ల‌చూను కాజ‌ల్ ఆగ‌ర్వాల్ వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత కూడా త‌న సినిమాల‌ను త‌గ్గించ‌కుండా పెంచుతూ పొతుంది.

అయితే తాజాగా కాజ‌ల్ ఆగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెట్టింట్లో ఉండే ప్ర‌తి ఒక్క‌రి నోట్లో కాజ‌ల్ పేరు వినిపిస్తోంది. దీనికి గ‌ల కార‌ణం. తాజా గా ఆమె సోష‌ల్ మీడియా లో చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌. అది ఎంటి అంటే ఒక ముఖ్య మైన విష‌యాన్ని త్వ‌ర‌లో మీతో పంచుకుంటాను. అందరు కాస్త వేట్ చేయండి అని సోష‌ల్ మీడియా చెప్పింది. దీంతో కాజ‌ల్ ఎం చెప్ప బోతుంది అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. కొత్త సినిమా గురించా.. లేక త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించా అని త‌మ బుర్ర‌ల‌ను వేడి చేస‌కుంటున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల ముందు నుంచి కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అయింద‌నే రూమ‌ర్స్ చాలా వినిపిస్తున్నాయి. ఈ రూమ‌ర్ల పై కాజ‌ల్ గానీ గౌత‌మ్ కీచ్లూ గానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పంధించ లేదు. దీంతో కాజ‌ల్ కు నిజంగానే ప్రెగ్నేన్సీ అని ఆ విష‌యాన్నే కాజ‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ బోతుంద‌ని త‌న అభిమానులు అంటున్నారు. అయితే కాజ‌ల్ ఏం చెప్పాల‌ని అనుకుందో త్వ‌ర‌లోనే తెలుస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: