అరుదైన అవార్ధు ను అందుకున్న దీపిక ప‌దుకొనే

Dabbeda Mohan Babu
దీప‌క ప‌దుకునే పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. బాలీవుడ్ లోనే కాకుండా భార‌త దేశం మొత్తం గుర్తించ‌త‌గిన స్టార్ హీరోయిన్ దీప‌క ప‌దుకునే. దాదాపు 10 సంవ‌త్స‌రాల నుంచి బాలీవుడ్ లో అగ్ర క‌థ‌నాయ‌క‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఎన్నో వైవిధ్య భ‌రిత‌మైన సినిమాల్లో న‌టించి త‌న కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు ను సంపాధించుకుంది. 2018 లో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి అయినా తన యాక్టింగ్ ను విడిచి పెట్ట‌క మంచి మంచి క‌థ ల‌ను ఎన్నుకుంటు సినిమా లు తీస్తుంది. ప్ర‌స్తుతం ఇండియాలో నే అత్య‌ధిక రెమ్యూనరేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ ల‌లో దీపిక కూడా ఒక్క‌రు.

ఇదీల ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు దీపిక త‌న న‌ట‌న‌తో చాలా అవార్డు ల‌ను సొంతం చేసుకుంది. తాజా గా మ‌రొక అరుదైన అవార్డును కూడా సంపాదించింది. ది గ్లోబ‌ల్ అచీవ‌ర్స్ అవార్డు 2021 అనే అరుదైన పుర‌స్కారాన్ని  దీపిక ప‌దుకునే ద‌క్కించుకుంది. ఈ అవార్డు ను ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా రంగంలో అత్యంత ప్రతిభ చాటిన వారికి ఈ అవార్డు ను ప్ర‌ధానం చేస్తారు. ఇంత వ‌ర‌కు ఈ అవార్డు మ‌న దేశంలో ఎవరికీ కూడా ద‌క్క‌లేదు. దీంతో ది గ్లోబ‌ల్ అచీవ‌ర్స్ అవార్డు గెలుచుకున్న మొట్ట మొద‌టి భార‌త న‌టి గా దీపిక ప‌దుకునే రికార్డు సృష్టించారు. దీపికా కు గ‌తంలో కూడా అనేక గుర్తింపు వ‌చ్చాయి. 2018 లో ప్ర‌పంచంలో నే 100 మంది ప్ర‌తిభా వంతుల‌లో దీపిక ప‌దుకునే ఒక్క‌రు అని టైమ్స్ మ్యాగ‌జైన్ తెలిపింది. ఆ జాబితా లో కూడా దీపిక పేరు చేర్చారు. అలాగే దీపిక సినిమా జీవితంలో మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు ఐఐఎఫ్ఏ అవార్డులు, మూడు స్టార్ డ‌స్ట్ అవార్డులు అలాగే తొమ్మిది స్క్రీన్ అవార్డులు సొంతం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: