ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన సినిమా తెలుసా?
ప్రభాస్ బాలీవుడ్ లో అడుగు పెట్టింది బహుబలి కన్న ముందే. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా 2014 లో యాక్షన్ జాక్సన్ అనే యాక్షన్ కామెడీ గ్యాంగ్ స్టార్ సినిమా వచ్చింది. ఈ సినిమా లో హీరో అజయ్ దేవగన్ రెండు పాత్రలల్లో కనిపిస్తారు. అయితే ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పది నిముషాల పాటు కనిపిస్తాడు. ప్రభుదేవా తో ఉన్న సన్నిహిత్యంతో ఈ సినిమా లో గెస్ట్ రోల్ చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడు. దీంతో యాక్షన్ జాక్షన్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ పాత్రలో కనిపించాడు. దీంతో ప్రభాస్ బాలీవుడ్ స్క్రీన్ పై కనిపించాలన్న అభిమానులు కల కొంత వరకు తీరినట్టే అని చెప్పాలి. అయితే ప్రభాస్ బాలీవుడ్ లో గెస్ట్ రోల్ కాకుండా ఫుల్ లెన్త్ పాత్రలలో నటించాలన్నది అభిమానులు కోరిక. అయితే ప్రస్తుతం ఒక బాలీవుడ్ నే కాకుండా యావత్ దేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలను తన సినిమా లతో ఊపేస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కు తెలుగు ప్రేక్షకుల తో పాటు యావత్ దేశ వ్యాప్తం గా కోట్లాది సంఖ్య లో అభిమానులు ఉన్నారు.