టమాటా కష్టాలు.. ప్రభుత్వాలు ఈ ఆలోచన చేయాలి?
ముఖ్యంగా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ఆలోచనలు వేరేలా ఉంటున్నాయి. మౌలిక వసతులు కల్పించి ఓట్లు వేయమని ప్రజలను అడిగితే వేయడం లేదనే ఆలోచనలో ఉంటున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలు తాత్కాలిక ప్రయోజనం కింద రూ. 5 కే అన్న క్యాంటీన్ పథకం, వైఎస్ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన లాంటి పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడే పథకాలు ప్రవేశపెట్టడం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరకు రెక్కలు వస్తున్నాయి. దాదాపు మార్కెట్ లో దాని రేటు రూ. 100 నుంచి రూ. 120 వరకు పలుకుతోంది. అయితే రేటు పెరిగిన తర్వాత ప్రభుత్వాలు దానిపై ధరను మోస్తూ ప్రజలకు భారం తగ్గిస్తున్నారు. ముఖ్యంగా రూ. 50 నుంచి 60 వరకు రేటును తక్కువ చేస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వానికి భారం పడుతుంది.
ధరలు పెరిగిన తర్వాత తగ్గించేలా చేయడం బదులు.. ముందుగానే ధరలను అదుపులోకి ఉంచుకుంటేనే సరిపోతుంది. దీనికి ప్రభుత్వాలు కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి. రాష్ట్రంలో ఏ పంట ఎంత దిగుబడి ఎప్పుడు వస్తుంది. ఏదీ పెరిగే అవకాశం ఉంది. ఏదీ తగ్గేలా ఉంది. రైతులకు ఎలా ప్రయోజనం కలిగించాలి. వినియోగదారులకు అనువైన ధరలో కూరగాయలు వస్తువులు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది.