వామ్మో..ఆ చిరంజీవి సినిమా చేతులు మారుతుందా..? ఏంటి ఈ షాక్..!
ఈ క్రమంలోనే, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించి అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఒక నిర్మాత చేతి నుంచి మరో నిర్మాత చేతికి వెళ్లే అవకాశాలున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి – బాబీ సినిమాను మొదట నిర్మించాల్సింది కన్నడ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కె. నారాయణ. గత రెండేళ్లుగా నారాయణ భారీ స్థాయిలో, పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా నిలిచింది ‘జననాయగన్’. తమిళ అగ్ర హీరో విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా ప్రచారం పొందిన ఈ చిత్రాన్ని కూడా నారాయణే నిర్మించడం విశేషం. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ఏర్పడింది.
‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ జరగడం, డిస్ట్రిబ్యూషన్ హక్కులకు రికార్డు ఆఫర్లు రావడం జరిగింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ అన్ని విభాగాల్లోనూ బిజినెస్ వేరే లెవెల్లో సాగింది. కానీ, అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఈ చిత్రం అనూహ్యంగా పెద్ద సమస్యల్లో చిక్కుకుంది. ముఖ్యంగా సెన్సార్ సంబంధిత అభ్యంతరాలు ఈ సినిమాను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడుతూనే ఉంది.ఈ ఆలస్యం కారణంగా మొదట కుదిరిన భారీ అగ్రిమెంట్లు ఒక్కొక్కటిగా రద్దు అవుతున్నాయన్న సమాచారం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గగా, వారికి నిర్మాతలు రీఫండ్‌లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు బయ్యర్లు అయితే పాత అగ్రిమెంట్లను రివైజ్ చేసి, కొత్త షరతులతో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు, థియేటర్లకు సంబంధించిన అడ్వాన్స్ చెల్లింపులు కూడా నిర్మాతపై అదనపు భారం పెడుతున్నాయి.
సినిమా విడుదల మూడు నుంచి నాలుగు నెలలు ఆలస్యం కావడంతో, పెట్టుబడులపై వడ్డీ భారం కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిస్థితి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆర్థికంగా ఒత్తిడిలోకి వెళ్లేలా చేస్తోందన్నది ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఇలాంటి సమయంలోనే చిరంజీవి – బాబీ సినిమా నిర్మాణ బాధ్యతను నారాయణ కొనసాగించగలరా? లేక ఈ ప్రాజెక్టు మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లిపోతుందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడం, బాబీతో మళ్లీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై బడా నిర్మాతలు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అయితే అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, చిరు–బాబీ సినిమా చుట్టూ నెలకొన్న ఈ అనిశ్చితి టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్‌గా మారింది.
మొత్తానికి, విజయాల ఊపులో ఉన్న మెగాస్టార్ కొత్త సినిమా ప్రయాణం ఎలా ఉండబోతోంది? నిర్మాత మార్పు జరుగుతుందా? లేక ప్రస్తుత సమస్యలన్నీ పరిష్కరించి ప్రాజెక్టు అనుకున్నట్టే ముందుకు సాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.