అమ్మ: గర్భధారణ సమయంలో వీటిని అసలు తినకూడదు..!!

N.ANJI
ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. మహిళల గర్భం దాల్చిన దగ్గర నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్బధారణ సమయంలో ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రెగ్నెసీ సమయంలో కడుపులోని బిడ్డ బాగా అభివృద్ధి చెందడానికి ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు మొదలైన పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పదార్థాలు తినకూడదని చెప్పుకొచ్చారు. ఏది పడితే అది తింటే.. గర్భస్రావానికి కారణం కావచ్చునని అన్నారు.
ప్రెగ్నెసీ సమయంలో బొప్పాయి తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా గర్భిణులు పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదని సూచిస్తున్నారు. ఇక బొప్పాయిలో పపైన్ అనే రసాయనం కారణంగా కడుపులో పెరుగుతున్న పిండంలో కొన్ని లోపాలు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. అందుకే.. అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
అలాగే గర్భిణులు పిచ్చి గుడ్లను తీసుకోకూడదని చెప్పారు. ఇక గుడ్డులో సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ గర్భస్రావం ప్రమాదాన్ని గురి చేస్తుందని తెలిపారు. పచ్చి గుడ్డు తీసుకోవడం వలన గర్భిణులలో వికారం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా జలుబు, దగ్గు తదితర సమస్యలు ఉన్నప్పుడు తరచుగా తులసి టీని లేదా తులసి ఆకులతో తయారుచేసిన వివిధ రకాల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. గర్భధారణ సమయంలో తులసి ఆకులను తీసుకోవడం వలన గర్భస్రావనికి దారి తీస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇక మహిళలు అధిక క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరుగుతుంటారు. అంతేకాదు..  శరీరంలో కొవ్వు పేరుకుపోయి గర్భధారణ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో అబార్షన్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  అందుకే గర్భిణులు ఉడకని మాంసం, సీఫుడ్, ప్రాసెస్ చేసిన మాంసం, నూనెలో ఎక్కువ వేయించిన, కాల్చిన మాంసం అసలు తినకూడదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: