తక్కువ కాలంలో ఆమె ఆ పర్యటన చేసింది

D.V.Aravind Chowdary
అతి తక్కువ కాలంలో 196 దేశాలు(ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశాలు) సందర్శించిన యవతిగా అమెరికా కు చెందిన రచయిత్రీ, యాత్రికురాలు ఐన కాసీ డె పెకాల్ రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా 27 ఏళ్ళకే ఈ ఘనత సాధించిన మొదటి మహిళా యాత్రికురాలిగా కాసీ ఈ ఘనత సాధించారు. జులై 24, 2015 లో తన 25 వ ఏటా ఈ పర్యటన ప్రారంభించి  ఫిబ్రవరి 2, 2017 లో ముగించారు. 

 ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ సంస్థ కు స్వచ్ఛంద రాయబారిగా ఉన్న కాసీ పని పరంగా రెస్పాన్సిబుల్ టూరిజం అండ్ ఏకానమిక్స్ గురించి యూనివర్సిటీ టూరిజం విభాగానికి చెందిన విద్యార్థులతో చర్చిస్తుంది. అంతేకాకుండా అడ్వెంచరర్స్ అండ్ సైoటిస్ట్స్ ఫర్ కన్సర్వేషషన్ తో కూడా పనిచేస్తోంది. అందులో భాగంగానే ఆమె నీటిలో మైక్రో ప్లాస్టిక్ ల ఉనికిని పరీక్షించడానికి నీటి శ్యాంపిల్స్ సేకరిస్తోంది. 


కాసీ కి బాల్యం నుంచి ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించాలని ఏంతో కోరిక అని, తద్వారా ప్రతి ప్రాంతం గురించి, వారి వారి సంస్కృతుల గురించి తెలుసుకోవాలన్నది తన ఆకాంక్ష . తన పూర్వీకులు యూరోప్ నుండి అమెరికా వలస వచ్చారని పేర్కొంటూ తన మూలాల గురించి వివరంగా తెలుసుకోవాలన్నది సైతం ఆ పర్యటనలో భాగం. 

అమెజాన్ కానీ ఇతర ఏ ప్రాంతమైనా కానీ వార్తల్లో చెప్పి నట్లే ఉంటుందా వేరుగా ఉంటుందా అన్నది తెలుసుకోవటమెంతో ఆసక్తికరంగా ఉంటుంది. 17 నెలల తన ప్రయాణం లో రకరకాల అనుభవాలు ముఖ్యంగా మహిళా గా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంన్నారు. కానీ తన పర్యటన నేటి యువతకు స్ఫూర్తినిచ్చింది అని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో 40 దేశాల్లో 16 వేల మంది విద్యార్థులతో మాట్లాడారు. తన ఈ పర్యటనకు సుమారు 111,000 డాలర్లు ఖర్చు అయ్యింది . ఈ  పర్యటన చేయడం ద్వారా కాసీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాందించారు . పలు సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: