గర్భిణీ స్త్రీలు వీటి జోలికి అస్సలు వెళ్ళకండి.. ఎందుకంటే?

Satvika
గర్భవతులు పొషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్య రీత్యా ఆలొచించి తినాలి. ఇద్దరు తిండి తినాలి అని ఆకలి లేకున్నా ఏది పడితే అది తింటే మొదటికే మోసం వస్తుంది. రుచికి తగినవి కాకుండా ఆరొగ్యాన్ని పెంచే వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. అప్పుడే బిడ్డ హెల్త్‌కి చాలా మంచిది. ఆ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన తిండిని తినాలని అనిపిస్తుంది. అలాగని ఏది పడితే అది తిని రిస్క్ చేయొద్దు.

కూరగాయలను ఎక్కువగా తీసుకొవాలని నిపుణులు అంటున్నారు. అంతేకాని రుచిగా వుండే చిప్స్, లెస్, కుర్ కురెలు తీసుకోవడం మంచిది కాదని హెచరిస్తున్నారు. ఆలూ చిప్స్ తీసుకున్నా అది ఒక లిమిట్ అంటే ఒక పది చాలు.అంతకన్నా ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగే ఆవకాశం ఉంది. దాంతో అధికంగా బరువు పెరుగుతారు. ఇది బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.గర్భధారణ సమయంలో, నాలుకకు పులుపు, లవణం, రుచికరమైన వాటిని తినాలని కోరిక ఉంటుంది.
అయితే, ఈ ఆలూ చిప్స్ ను ఎందుకు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారో ఇప్పుడు చూద్దాం..
ఈ చిప్స్ చెడు నూనెతో తయారు చేస్తారు.అంటే ఓకే నూనె తో ఎన్నో సార్లు చిప్స్ చేస్తారు. ఈ ప్యాకెట్ తినడం వల్ల మన కడుపు దెబ్బతింటుంది.ఇకపోతే వీటిలో ఉప్పు లేదా కారం శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక ఉప్పు చిప్స్ తీసుకుంటే, అది మీ శరీరంలో ఎక్కువ నీటిని ఉంచుతుంది. దీని ద్వారా కాళ్ళు, చేతులు వాసినట్లు కనిపిస్తాయి. ఇది గుర్తుంచుకోండి.. అందుకే గర్భవతులు ఈ చిప్స్ ను తక్కువగా తీసుకోవాలి. ఇది రోజువారీ కేలరీలను పెంచుతుంది. ఉప్పు తీసుకోవడం పరిమితం చేయడం సురక్షితం. అందుకే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం..కూరగాయలను, ఆకు కూరలను,పండ్లు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: