అమ్మ: ఈ థెరిపీలు చేసుకుంటే పిల్లలు పుట్టరా..?

N.ANJI
అత్యధిక శాతం మహిళల్లో తలెత్తె సమస్య బ్రెస్ట్ క్యాన్సర్. ఈ సమస్య నివారణకు మహిళలు థెరిపీలను ఆశ్రయిస్తారు. థెరిపీలు నిర్వహించుకున్న తర్వాత చాలా మంది మహిళలు గర్భిణులు అయ్యారు. కొందరు ఫెర్టిలిటి సమస్య బారిన పడ్డారని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది వైద్యులు చెప్పిన విషయం ప్రకారం.. బ్రెస్ట్ క్యాన్సర్‌ సమస్యతో బాధపడే వారు చికిత్స చేయించుకున్న తర్వాత గర్భిణులు అవ్వడం ఎంతో కష్టం అని పేర్కొన్నారు. చికిత్స తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, గ్లాండ్స్‌ పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని, దీంతో ఇన్ఫెర్టిలిటీకి దారి తీస్తుందన్నారు. ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత మహిళల్లో ఫెర్టిలిటిలో మార్పులు వస్తాయన్నారు.
మహిళలు కీమో థెరిఫీ చేయించుకోవడం వల్ల ఓవరీస్ ఎగ్స్‌ ను, ఈస్ట్రోజన్‌ను ఉత్పత్తి చేయలేవు. చికిత్స అనంతరం రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దెబ్బతింటాయని వైద్యులు తెలిపారు. అబ్డొమెన్, పెల్విస్ దగ్గర సర్జరీ చేయడం వల్ల రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ దెబ్బతిని ఫెర్టిలిటిపై ప్రభావం చూపుతుంది. అలాగే క్యాన్సర్ చికిత్సకు  హార్మోన్ థెరిపీ కూడా చేస్తుంటారు. దీని వల్ల పీరియడ్ టైంతోపాటు ఫెర్టిలిటి కూడా దెబ్బతింటుంది. కీమో థెరిఫీలో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళలు చికిత్స మొదలు పెట్టకన్న ముందే ఫెర్టిలిటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. అలాగే కీమో థెరిపీ, హార్మోన్ థెరిపీ చికిత్సలు చేయించుకుంటున్నా వైద్యులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. అయితే ఈ థెరిపీలో చేయించుకునేంత వరకు గర్భిణీ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని ట్రీట్‌మెంట్ మధ్యలో ఆపేసి.. గర్భిణీ అవ్వాలనుకుంటే క్యాన్సర్ సమస్య మరీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒక వేళ గర్భిణీ అయి.. పుట్టిన పిల్లాడికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

చికిత్స సమయంలో పాల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. అలా ఫీడింగ్ సమయంలో నొప్పి, తదితర సమస్యలు తలెత్తె అవకాశాలు ఉంటాయి. అందుకే చికిత్స సమయంలో వైద్యుల సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పిల్లలు కావాలనే ఆశను పక్కన పెట్టాలని వైద్యులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: