సాంప్రదాయ ముసుగులో స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నామా..!

MOHAN BABU
దుర్గాదేవి,కాళీకామాత, గ్రామ దేవతలైన మైసమ్మ, పోచమ్మ వంటి దేవతా విగ్రహాలని భీతి గొలిపే విధంగా పెద్ద పెద్ద బొట్టుతో, నాలుక బయటికి పెట్టి, కళ్ళు పెద్దగా తెరిచి కొన్ని సందర్భాల్లో త్రిశూలం క్రింద పడవేసి తొక్కుతూ, చంపుతూ ఉన్నట్లుగా దర్శనమిస్తాయి . మరికొన్ని చోట్ల మనుషుల పుర్రెలు మెడలో మాలగా వేసుకొని, చేతుల్లో కత్తులు పట్టుకొని తాండవం చేస్తూ ఎదుటి వారు తమను తాము సమర్పించుకునే విధంగా కనిపిస్తుంటారు. ఎందుకబ్బా  దేవతలను ఈ విధంగా చూపిస్తారు లేదా ప్రతిష్టిస్తారు అని చిన్నప్పుడు సందేహం కలిగేది. కానీ స్త్రీలపై ఈ మధ్యకాలపు పోకడలను చూశాక అర్థమవుతుంది ఏమిటంటే  ఆ రోజుల్లోనూ స్త్రీల పై జరిగిన అణచివేతను  తీవ్రంగా ప్రతిఘటించడం వల్లనే ఈ విగ్రహ ప్రతి రూపాన్ని ఆ నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వెలసి ఉంటాయి.

ఆ రోజుల్లో ఎంతటి నిర్బంధం, ఎంతటి దాష్టికం, ఎంతటి బలప్రయోగం, ఎంతటీ అణచివేత స్త్రీలపై జరిగిందో.. దాని వల్లనే స్త్రీలు తిరుగుబాటు చేసి ఆ రకమైన భద్రకాళికమాతలై సమాజంలో తమకు తాము గుర్తింపు తెచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది. చరిత్ర కనుమరుగవుతున్న కొద్ది స్త్రీల పౌరుషాన్ని విగ్రహాల కే పరిమితం చేసి వంటింటి కుందేళ్ళలా,వాకిట్లో పిడకలు పిసికే గొబ్బెమ్మలు గా, భర్త కాల్లు నొక్కే దాసి తనానికే పరిమితం చేయాలనుకునే మతాధిపత్యపు దురుద్దేశం మళ్లీ జడలు విప్పుతూనే ఉంది. తమ ఆధిపత్య ధోరణికి సాంప్రదాయమనే ముసుగులు తొడిగి స్త్రీకి తానే స్వీయ నిబంధనలు పెట్టేలా తయారు అవుతున్నది. ఒక్కో అవసరానికి ఒక్కో విధంగా ఎవరైనా తయారవుతుంటారు. ఆ మాత్రం స్వాతంత్రం లేదా? జాకెట్ గుడ్డ కొనుక్కోలేని దుస్థితి గల స్త్రీలందరొ మన దేశంలో ఉన్నారన్న విషయం ఈ ప్రజాప్రతినిధులకు అగుపడడం లేదేమో. అయితే జాకెట్ లు వేసుకో కూడదు అనే సంప్రదాయాలు కూడా అనేక కులాల్లో ఉన్నవి. మరి వీరికి భయపడి అలాంటి సంప్రదాయాన్ని వదిలి అందరూ తమ కట్టు బొట్టు మార్చుకోవాలా? సౌకర్యవంతమైన వస్త్రధారణ కూడా స్త్రీల పట్ల శాపంగా పరిణమింపచేసే ఈ సంప్రదాయం మరణశాసనమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: