అమ్మ: గర్భిణులు వికారంతో బాగుపడుతున్నారా.. ఇలా చేయండి..??

N.ANJI
గర్భధారణ సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది వాంతులు కాకుండా ఉండేందుకు ఆహారం తీసుకోవడం మానేస్తుంటారు. ఆలా ఆహారం తీసుకోకపోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఎక్కువగా తినకూడదంటే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభించకుండా కొంత మంది మితంగా తింటుండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలా తక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణులు తీసుకునే ఆహారంతోనే మనలో పెరుగుతున్న పిండం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాక.. గర్భధారణ సమయంలో ఎవరైనా వికారం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొన్నపుడు మీరు తక్కువ తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. మొత్తంగా తినకుండా ఉండడం కంటే కొంత కొంత తినడం వలన మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు దొరుకుతాయని అన్నారు. ఇక గర్భిణులు ఎంత ఆహారం తీసుకుంటున్నారనే విషయం కన్నా ఎంత ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటున్నారనే విషయాన్ని సరి చూసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇలా ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటేనే మన శరీరంలో పెరుగుతున్న బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
అలాగే గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలా అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వలన హైడ్రేట్ గా ఉండవచ్చునని అన్నారు. అయితే ఎవరికైనా వికారం వంటి సమస్య ఉంటే.. ఆ నీటికి కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని తాగాలని చెబుతున్నారు. కాగా.. నిమ్మరసంతో కలిపిన నీటిని తాగడం వలన వికారం, వాంతులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చునని అన్నారు. అంతేకాదు.. ఇలా నీటిని తీసుకోవడంతో పాటు ఎటువంటి సమస్య ఉన్నా మీరు డాక్టర్ ను సంప్రదించడం మంచిదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: