వయసు పైబడిన మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోండి ?

VAMSI
వయసు పై బడుతున్న కొద్ది శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. చర్మం మారుతుంది, శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. అయితే మగవారికి, మహిళలకు ఈ మార్పులలో కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎక్కువగా మహిళల్లో శక్తి, సామర్ధ్యాలు తగ్గడం చూస్తుంటాం. కానీ అందరూ ఒకేలా ఉండరు. కొందరు వయసు ఎంత పెరుగుతున్న నిత్య యవ్వనం గానే ఉంటారు. ఎంతో ఆరోగ్యంగా చలాకీగా తమ పని తాము చేసుకోవడమే కాదు, వృత్తి రీత్యా కూడా ఎప్పటి లాగే తమ సత్తా చాటుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇదేమీ అద్బుత రహస్యమో, ఇంకేదైనా మాయో కాదు. వారికి జన్యు పరంగా వచ్చి ఉండొచ్చు..లేదా ఎక్కువగా వారి ఆహారపు అలవాట్ల వలన, వారి జీవన శైలి వలన వచ్చే అదృష్టం. ఇంతకీ మీరు అలా వయసు పెరుగుతున్నా యవ్వనంగా , ఆరోగ్యంగా , దృఢంగా జీవించాలి అంటే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న సూచనలు తెలుసుకుని పాటించాల్సిందే. ఇవి ముఖ్యంగా మహిళలు కోసం చెప్పబడినవి అని గుర్తించగలరు.
* ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలను తీసుకోవాలి. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటుతుంది అంటే వారి డైట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మహిళలు రోజు నాలుగైదు నానబెట్టిన బాదం పప్పులను తినడం అలవాటు చేసుకోండి, అలాగే రోజు ఒక గ్లాసు పాలు తాగండి. ఇవి మీ ఎముకలు మరింత దృఢంగా మారేలా చేస్తాయి. తద్వారా వయసు పెరిగిన కూడా మీ శరీరం అంతే బలంగా ఉండి  పనులు చేసుకోవడానికి సహకరిస్తుంది.
 
* అలాగే వారానికి మూడు నాలుగు సార్లు మీ ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. తద్వారా పోషకాలు అంది ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు. ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో అవసరం.
* శరీర బరువుపై దృష్టి పెట్టండి. ఖచ్చితంగా వయసు మీద పడుతున్న కొద్దీ 10 శాతం కేలరీలను తగ్గించాలి. మీ డాక్టర్ సలహా తీసుకుని లిమిటెడ్ ఫుడ్ ను అలవాటు చేసుకోండి. బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. వృద్ద వయసులో బరువు పెరిగితే తగ్గించుకోవడం చాలా కష్టం.
 
కాబట్టి ముందు నుండే జాగ్రత్త వహించండి. అందుకు తగిన ఆహార పదార్ధాలు పరిమితంగా తీసుకుంటూ ఖచ్చితంగా వ్యాయామం చేయండి.
* పిండి పదార్ధాలను తక్కువగా తీసుకోండి, వాటిని నియంత్రించండి. ఎక్కువగా పీచు పదార్దాలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.
* ఏ వయసులో ఉన్న వారైనా సరే వ్యాయామం తప్పనిసరి. అయితే వయసును బట్టి మీ డాక్టర్ సలహాను తీసుకుని వారు చెప్పే వ్యాయామాలను చేయండి.
ఇలా చేస్తే మీకు వయసు పైబడినా ఆరోగ్యంగా బలంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: