మహిళల గొప్పతనాన్ని చాటిన వీరిద్దరి గురించి ఒక లుక్కేయండి...

VAMSI
మారుతున్న కాలంతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలోను ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు. నువ్వా నేనా అన్నట్ట గా పోటీ పడుతూ తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అతివలు ఎందులోనూ తక్కువ కాదు అంటూ తమ ప్రతిభను కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము నివసిస్తున్న ప్రాంతాల ప్రజల మన్నలనే కాదు వారి ప్రతిభను ప్రపంచమంతా గుర్తించేలా రాకెట్ లా దూసుకుపోతున్నారు.  ప్రపంచ దృష్టినే తమ వైపు తిప్పుకున్న కొందరు అత్యంత అద్భుతమైన గొప్ప మహిళలు గురించి ఇపుడు తెలుసుకుందాం. వ్యాపారంలో తమదైన శైలిని ప్రదర్శించి సాధించిన కీర్తిని, ఉన్నతి గురించి తెలుసుకుందాం. వీరు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న మహావనితలు.
జూలియా కోచ్‌
డేవిడ్‌ కోచ్‌ అనే గొప్ప వ్యాపారవేత్త  కోచ్‌ ఇండస్ట్రీస్‌ ని నడిపించేవారు. ఇది అమెరికన్‌ రసాయన ఉత్పత్తి సంస్థ. ఈయన మరణానంతరం (2019) అదే ఇండస్ట్రీలో 42 శాతం వరకు  షేర్స్ కలిగిన అతని భార్య జూలియా కోచ్‌, వారి పిల్లలకు  వారసత్వంగా లభించాయి. కాగా  ఫ్యాషన్‌ డిజైనింగ్ రంగంపై ఉన్న ఇష్టంతో జూలియా అటువైపుగా అడుగులు వేశారు. 1980ల్లో ఫ్యాషన్‌ డిజైనర్‌గా తన ప్రతిభను కనబరిచి ఖ్యాతిని  పొందారు. అమెరికన్‌ ప్రథమ మహిళ నాన్సీ రీగన్‌ వంటి ప్రముఖులకు విభిన్న దుస్తులు రూపొందించి అందించింది. బిజినెస్ పరంగానే కాదు ఇతరులకు సహాయం చేయడంలోనూ ఎపుడు ముందుంటారు జూలియా. స్టాన్‌ఫోర్డ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు.. మౌంట్‌ సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌ వంటి వాటికి మిలియన్ల కొద్ది విరాళాలు అందించారు. ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సహాయం తాను చేస్తుంటారు జూలియా. ఇక ఆమె ఆస్తి వివరాలకు వస్తే 46.3 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల భారీ ఆస్తిపాస్తులతో  ఇటీవలే ఫోర్బ్స్‌ జాబితాలో 28 వ స్థానం ను సొంతం చేసుకున్నారు జూలియా.
అలైస్‌ వాల్టన్‌
స్వయం కృషితో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సంకల్పించి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న గొప్ప మహిళ. ఈమె వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకుడు సామ్‌ వాల్టన్‌ యొక్క కుమార్తె. కానీ తండ్రి ఆస్తులను ఆశించలేదు. తనకంటూ ఈ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంది. తనకు ఎంతో మక్కువ ఉన్న క్యురేటింగ్‌ ఆర్ట్‌ వైపు అడుగులు వేశారు...తన కలకు రూపం పోశారు. 2011లో  బెంటన్‌విల్లే లో ‘క్రిస్టల్‌ బ్రిడ్జెస్‌ మ్యూజియం ఆఫ్‌ అమెరికన్‌ ఆర్ట్‌’ అనే పేరుతో ఒక  ఆర్ట్‌ మ్యూజియంను నెలకొల్పారు. నోర్మన్‌ రాక్‌వెల్‌, మార్క్‌ రోథ్కో. ఆండీ వార్హోల్‌..  వంటి ప్రముఖ కళాకారుల పెయింటింగ్ వారి నూతన ఆవిష్కరణలకు ఆ మ్యూజియం నివాసంగా మారింది. ఇపుడు  అలైస్‌ ఏకంగా 64 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపాదిస్తూ ఫోర్బ్స్‌ జాబితాలో 17వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: