అమ్మ: ఈ 5 వంటింటి చిట్కాలు మీ కోసమే...

VAMSI
మహిళ వంటింట్లో ప్రతి రోజు కుస్తీ పడాల్సిందే  పొద్దున లేచింది మొదలు కాఫీలు, టీలు, టిఫిన్లు, కూరలు ఇలా ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. వంటింట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే మహిళలకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు ఇప్పుడ తెలుసుకుందాం. అన్నట్టు ఇవి కేవలం మహిళలకు మాత్రమే కాదండోయ్. వంట చేస్తూ తంటాలు పడే బ్యాచిలర్ బాబులకు కూడా ఉపయోగపడతాయి. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
*  డ్రై ఫ్రూట్స్ ని హెల్తీ డైట్ లో బాగంగా చాలా మంది రోజు తింటుంటారు. అందుకని ఎక్కువగా తెచ్చుకుని స్టోర్ చేసుకుంటారు. అయితే ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, అవి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా, మెత్త పడిపోకుండా, అలాగే స్మెల్ మారకుండా ఉండాలంటే వాటిని పాకెట్ లో వదిలేయకుండా ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.
* గోధుమ పిండి, శెనగ పిండి, మైదా పిండి ఇలాంటివి నిలువ చేసుకోవాల్సి వచ్చినపుడు అవి పురుగు పట్టకుండా ఉండాలంటే కొందరు వాటిని ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. అలా కాకుండా  గాజు సీసాల్లో పోసి ఒక గుండ్రటి కర్రతో కానీ పప్పు గుత్తి వెనక్కు తిప్పి దానితో కానీ పిండిని బాగా సీసాలో అదమాలి అప్పుడు పిండిలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు.
*  ఇక వంటకి కరివేపాకు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అలాంటి కరివేపాకును ఎలా ఎక్కువ రోజులు నిలువ ఉంచాలి అంటే ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆకులను కాడల నుండి తీసేసి వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో కింద టిష్యూ పేపర్ లేదా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ ను వేసి పైన కరివేపాకు ఆకులను వేసి మూత గట్టిగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన కరివేపాకును ఎక్కువ రోజులు బూజు పట్టకుండా, ఎండిపోకుండా, రంగు మారిపోకుండా నిలువ చేసుకోవచ్చు.
* అయితే కొత్తిమీర , పుదీనా  స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్. కానీ వీటి పైన కూడా టిష్యూ పేపర్ వుంచాలి. అలాగే పండు ఆకులను తీసివేయాలి. లేదంటే మిగిలిన ఆకులు కూడా వాడిపోయే అవకాశం ఉంది.
* వంటింట్లో పేరుకుపోయిన మొండి మరకలను శుభ్రం చేయడానికి కొద్దిగా సర్ఫ్ ఎక్సెల్ పౌడర్, ఇంకొద్దిగా వంట సోడా  అలాగే కొద్దిగా వెనిగర్ ని వేసి మూడింటిని బాగా మిక్స్ చేసి మరకలు ఉన్న చోట ఆ మిశ్రమం వేసి ఓ నిముషం అలా వదిలేయాలి. ఆ తర్వాత బాగా స్క్రబ్ చేస్తే మరకలు పోతాయి.
ఈ 5 చిట్కాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: