కరోనా సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

VAMSI
గత రెండేళ్ల నుండి కరోనా ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. గత కొద్ది రోజుల నుండి వైరస్ వ్యాప్తి తగ్గు ముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు ఇంకా పొంచే ఉందన్న వార్తలు జనాల్ని ఇప్పటికీ కలవరపెడుతూనే వున్నాయి. ఈ క్రమంలో గర్భిణీ స్త్రీలు గందర గోళ పరిస్థితికి లోనవుతున్నారు. కొందరేమో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదటికొచ్చేలా ఉందని అంటుంటే ఇంకొందరేమో కరోనా అసలు లేనే లేదు అంటున్నారు. దాంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కరోనా జాగ్రత్తలు పాటించాలా లేక ఎప్పటిలాగే స్వేచ్చగా ఉండొచ్చా అన్న అనుమానాలతో సతమతమవుతున్నారు. అయితే ఇందుకు నిపుణులు చెబుతున్న సలహాలు, ఇస్తున్న సూచనలు ఏమిటంటే,
కరోనా ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం ఉత్తమం. ముఖ్యంగా వయసు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అత్యంత జాగ్రత్త వహించడం అవసరం. ఇక గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు చెబుతున్న సూచనలు ఏమిటంటే...
* ఎటువంటి నిర్లక్ష్యం వహించక కరోనా నిబంధనలను తప్పక పాటించండి. బయటకు వెళ్లాల్సి వస్తే భౌతిక దూరాన్ని తప్పక పాటించండి..అలాగే మాస్క్ మరియు సానిటైజర్ తప్పనిసరి.
* అవసరమైతేనే హాస్పిటల్ కు వెళ్ళండి. చిన్న చిన్న సమస్యలకు వెళ్లడం మంచిది కాదు.
* ఏ మాత్రం ఆరోగ్యం క్షీణించినా అశ్రద్ద వహించకుండా డాక్టర్ ను సంప్రదించి వారి సలహా తీసుకోండి.
* పోషకాహారాన్ని తీసుకోవడంలో అశ్రద్ద అస్సలు వద్దు.
* వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు సంతోషాన్ని కలిగించే పనులను చేయండి.
* బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
* గర్భంతో ఉన్న వారికి నెలలు నిండుతున్న కొద్దీ కొంచెం భారంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సేపు నడుస్తూ ఉండడం మంచిది.
ప్రమాదం ఎలా వస్తుందో ఊహించలేము. వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: