మహిళ: తల్లిగా అప్పుడే మీరు విజయం సాధించినట్టు...

VAMSI
 ఈ ప్రపంచంలో మహిళ అనేక బాధ్యతలతో బిజీగా ఉంటుంది. అయితే వీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలలో అతి ముఖ్యమైనది తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం. మంచి జీవితాన్ని ఇవ్వడమంటే వీరు సంపాదించిన ఆస్తులను ఇవ్వడం కాదు. ఒక తల్లిగా తన బిడ్డలను పుట్టిన నాటి నుండి వారికీ ఒక భవిష్యత్తు ఏర్పడే వరకు వారిని  ప్రతి క్షణం గైడ్ చేయాలి. ఒక తల్లిగా పుట్టిన చిన్న బిడ్డ నుండి కాలేజీ కు వెళ్లే ముందు వరసకు తల్లి ప్రేమతో పెరుగుతారు. ఈ సమయంలోనే తల్లి తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. నేడు పిల్లలు సరిగా పెరగక సరైన మానవతా విలువలను నేర్పించక అడ్డదారులు తొక్కుతున్నారు. నేడు జరుగుతున్న ఎన్నో నేరాలు మరియు అత్యాచారాలలో ఎక్కువగా యువత పాత్రే అధికంగా ఉంది. 

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో తల్లి తన కొడుకును సరిగా పెంచాలి. మంచి విలువలను నేర్పించాలి. సమాజం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని వారికీ తెలిసేలా చేయాలి. ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. బయట వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలను మీరుబ్ తెలుసుకుంటూ ఉండాలి. మీరు ఏమైనా తేడాలను గమనిస్తే వాటిని మీ పిల్లలలో సరిచేయాలి. అది కూడా పాజిటివ్ మ్యానర్ లోనే వారికి చెప్పాలి. దాని వల్ల కలిగే కలిగే దుష్పరిణామాలను వారికి తెలిసేలా చేయగలిగితే చాలు. ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది. ఒక తల్లిగా తన పిల్లలను ఒక వయస్సు వచ్చే వరకు మానవతా విలువలను నేర్పించగలిగితే మీరు మీ బిడ్డ జీవితంతో పాటు సమాజములో మరి కొందరి జీవితాలను కాపాడినవారవుతారు.

ఇదే విధంగా ప్రతి ఒక్క తల్లి అలోచించి వారి పిల్లలను ఒక మంచి మనిషిగా సమాజంలో వదిలిపెడితే అన్నింటికన్నా   ఒక మహిళకు తల్లిగా ఇదే పెద్ద విజయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: