అనాధ శరణాలయం నుంచి క్రికెటర్ గా ఆమె ఎదిగిన తీరు అసామాన్యం..

Mamatha Reddy
టీవీలో క్రికెట్ చూసేవారికి ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పరిచయమయ్యే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన లీసా ప్రస్తుతం కామెంటేటర్ గా కూడా రాణిస్తుంది. ఈరోజు ప్రపంచమంతా ఆమెను చూస్తుంది కానీ ఒకప్పుడు తమకు వద్దని వదిలేసారు రోజుల బిడ్డగా ఆమె తల్లి తండ్రులు. అనాధ ఆశ్రమంలోని లిసా ఆస్ట్రేలియా వరకూ ఎలా వెళ్ళింది ఎలా క్రికెటర్ గా మారింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మం వద్ద రోజుల బిడ్డ అయినా లీసా ని తమకు వద్దని వదిలేసి వెళ్లిపోయారు ఆమె తల్లిదండ్రులు. దాంతో అనాధ ఆశ్రమం నిర్వాహకులు లైలా అనే పేరు పెట్టి ఆమెను పెంచసాగారు.
అయితే అమెరికాకు చెందిన సూ స్దాలేకర్, ముంబైకి చెందిన హార్న్ స్దాలేకర్ దంపతులు క్రైస్తవ మిషనరీలు గా పనిచేసేవారు. అప్పటికే వారికి ఒక కూతురు ఉంది. అయితే ఒక అబ్బాయిని దత్తత తీసుకోవాలని ప్రయత్నాలు చేయగా వారికి అబ్బాయి దొరకలేదు. ప్రయత్నం చేసి వేస్ట్ అని భావిస్తున్న సమయంలో లిసా గురించి తెలిసింది. అక్కడికి వెళ్లి ఆ చిన్నారిని చూడగానే మనసు కరిగిపోయింది. వెంటనే ఆమెను దత్తతు తీసుకొని ఇండియా నుంచి అమెరికా లోని వెళ్లిపోయారు. అమెరికాలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ కుటుంబం కెన్యా వెళ్ళింది. మరికొంత కాలం తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ కి వచ్చి స్థిరపడ్డారు.
ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలోనే క్రికెట్ తో పరిచయమైంది లిసా కు.. అప్పుడే తెలియదు ఆమె కు భవిష్యత్ లో క్రికెటే ప్రపంచం అవుతుందని. తమ ప్రాంతంలో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది లిసా. అయితే  క్రికెట్ అంటే అబ్బాయిలు మాత్రమే ప్రొఫెషనల్ గా భావించే ఆట అని అనుకునేది. ఆడవారు ఆడరేమో అనుకునేది.  అయితే ఒకసారి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ కు తండ్రి తీసుకుని వెళ్లారు. అక్కడ అమ్మాయి లు ఆడడం చూసి ఆశ్చర్య పోయింది. ఆ తర్వాత తన కోరిక ను తండ్రి కి వెళ్ళబుచ్చగా వారు ఒప్పుకున్నారు. అలా తన తొలి అడుగులు వేసి పట్టుదలతో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. బౌలర్ గా ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: