పేరుకు మాత్రమే రాణి కాదు..చేయుతలోను మహారాణి

Mamatha Reddy
రక్తంలోని సహాయం చేయాలనే గుణం ఉంటుంది. స్వతహాగా వారికి ఆ అలవాటు అబ్బుతుంది.  కానీ మధ్యలో ఇప్పుడు ఎవరికి ఇలాంటి అలవాటు అబ్బదు. సేవ చేయాలనే లక్షణం అందరిలో ఉన్న పరిస్థితుల రీత్యా చేయలేరు. కానీ అలాంటి అవసరం, సమయం వచ్చినప్పుడు మాత్రం అందరూ తప్పకుండా సమాజ సేవ చేయడానికి పూనుకుంటారు.  కోట్ల ఆస్తి, రాజ వంశపు మర్యాదలు, హంగు ఆర్భాటాలు , మహారాణి లాంటిది జీవితం ఉన్నా కూడా ఓ మహిళ నిరాడంబరంగా సమాజ సేవ చేస్తూ జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె రాధికారాజే గైక్వాడ్.

పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగు ఆర్భాటం తో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధిక రాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ పరంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సాధారణ జీవన శైలికి తన తండ్రి స్ఫూర్తి అని గర్వంగా చెబుతారు. బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూశాక పాతకాలంనాటి కళాఖండాలు, నేటి పద్ధతులు చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయి అనుకొని ఇప్పుడు కూడా వీటిని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆమె.

ఇలా చేస్తే స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చు అన్న ఉద్దేశంతో తన అత్త గారితో కలిసి నేత పద్ధతులు చేనేత పద్ధతులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరు తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్ డౌన్ సమయంలో రాధికా చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. 700 కుటుంబాలకు పైగా కుటుంబాలను ఆదుకున్నారు ఆమె. ఎంతో గొప్ప చదువులు చదివి ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆమె ఇలా సేవ చేయడం దేశానికే గర్వకారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: