అమ్మ: గర్భధారణ సమయంలో కడుపు గట్టిగా ఉంటే దాని అర్థం ఇదే..!
కడుపు గట్టిగ ఉండటం ప్రమాదం ఐతే ఏమీ ఉండదు కానీ, కడుపు కండరాలు గట్టిగా ఉండటం వలన గర్భాశయంపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. అలాగే గర్భాశయ కండరాలు గట్టిగా మారటం వలన మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఇలా గట్టిగా కడుపు ఉండటం వెనుక ఎక్కువ శ్రమ, సెక్స్, రక్తస్రావం, డీ హైడ్రేషన్ కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఇక ఇంతకుముందే చెప్పుకున్నట్లు ప్రగ్నన్సీ మహిళ తప్పకుండా మంచినీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నీరు ఈ సమయంలో తక్కువ ఐతే శరీరం వేడిగా ఉండటం, కాళ్ళు, చేతులు వాపులుగా ఉండటం జరుగుతుంది. అందుకని మంచి నీటిని ఎక్కువగా తీసుకోమని గర్భిణీ మహిళలకు చెప్పండి. వెచ్చగా ఉండే పానీయాలు పాలు, గ్రీన్ టీ వంటి పోషక విలువలు బాగా ఉన్నటువంటి ద్రవాలను తీసుకోవడం వలన కొంచెం ఉపశనంగా ఉండి, కండరాలపై ఒత్తిడి ఉండదు.
అయితే గర్భంతో ఉన్నప్పుడు గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయడం వలన కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే కడుపు కండరాలపై కలిగే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడు ఒకేచోట కూర్చోవడం, ఒకే పొజిషన్ లో ఎక్కువ గంటలు పడుకోవడం, చాలా ఎక్కువ సమయం నిలబడటం కూడా కడుపు కండరాలు గట్టిగా మారటానికి కారణం. మీ శరీరానికి ఈ సమయంలో రక్త ప్రసరణ బాగా జరగటం చాలా అవసరం కాబట్టి కాస్త నడవటం, తిరగటం చేయాలి. కడుపు కండరాలు మరీ ఎక్కువగా ఉండి, నొప్పిగా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ వెళ్లి చెకప్ చేయించండి.