ఇండియా హెరాల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కోటిరెడ్డి సతీమణీ శ్రీజ రెడ్డి మాతృత్వానికి హ్యాట్సాఫ్ ..!!

Mamatha Reddy
ఏ బంధంలో అయినా స్వార్థం, అసూయ, ఈర్ష్య ఉంటాయో కానీ అమ్మ అనే అనుబంధంలో ఎలాంటి నెగెటివ్ థాట్స్ కి తావు లేదు.. అమ్మ అంటేనే ఓ గొప్ప అనుబంధం.. అలాంటి అనుబంధాల్ని చూపించడంలో కొంతమంది తల్లులు ఆ దేవుడినే మించిపోయారు. నిజానికి దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించారని అంటారు.. అయితే ఆ దేవుడు కూడా ఓ తల్లి కి కొడుకే అన్న విషయం ఎవరూ మర్చిపోవద్దు.. మరి ఆ దేవుడిని మించిన ప్రేమను పంచి, ఆ దేవుడు పెట్టిన పరీక్షను నెగ్గి తన కొడుకును కాపాడుకున్న ఓ తల్లి కథేంటో ఇప్పుడు చూద్దాం..
ఇండియా హెరాల్డ్ సంస్థ జర్నలిజం రంగంలో రోజు రోజుకి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. దీనివెనుక చాలామంది జర్నలిస్టుల కృషి ఉన్నా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోటిరెడ్డి గారి కృషి, అంకితభావాలను మరచిపోలేము.. ఒక సామాన్య వ్యక్తి నుంచి వందలమందికి ఉద్యోగాలనందించిన అయన ప్రయాణం అసామాన్యం.. అలాంటి వ్యక్తి వెనుక ఓ స్త్రీ ఉంది.. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లు ఈయన కష్టం, నష్టం, సుఖ, దుఃఖాల వెనుక ఓ స్త్రీ శక్తి ఉంది.. ఓ మంచి స్నేహితురాలిలా ఆమె అయన వెన్నంటి ఉంటూనే వారి కష్టాల లోగిలో ఓ శక్తి గా తయారై తన కుటుంబంలో నవ్వులు విరిసిల్లేలా చేసింది ఆ స్త్రీ శక్తి...
శ్రీజ, కోటిరెడ్డి గారిలా తనయుడు ఓ మానసిక రుగ్మతతో బాధపడేవాడు.. సొంత కొడుకు అలా బాధపడుతుండటంతో తల్లిగుండె తట్టుకోలేకపోయింది.. కొడుకుకు నయం చేయించుకునేందుకు వారి మొక్కని దేవుడు లేదు..వెళ్లని డాక్టర్ లేడు.. ఎలాగైతేనేం ఆ దేవుడు ఇచ్చిన కష్టాన్ని, పెట్టిన పరీక్షని ఎంతో ఆత్మస్థైర్యంతో , ధైర్యంతో తన కొడుకు ను బాగుచేయించుకోగలిగారు.. ఆదిపరాశక్తి అవతారంలా ఆ దేవుడిని సైతం గెలిచి నిలిచినా శ్రీజ రెడ్డి నిజంగా ప్రపంచం గర్వించదగ్గ గొప్ప తల్లులలో ఒకరని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: